Two Sisters Died within Hours : అనారోగ్యంతో అక్క మృతి చెందటాన్ని తట్టుకోలేని చెల్లి గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచిన ఘటన నెల్లూరు నగరంలో జరిగింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమార్తెలూ ఒకే రోజు మరణించటంతో మాజీ జవాన్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే :పటారుపల్లి చలపతినగర్కు చెందిన మాజీ జవాన్ మల్లికార్జున, యామిని దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె యమున ఇంటర్ పూర్తయి నీట్‌కు సిద్ధమవుతుండగా, రెండో కుమార్తె తులసి మానసిక దివ్యాంగురాలు కావటంతో ఇంట్లోనే ఉంటోంది. నాలుగు నెలల క్రితం యమున అనారోగ్యానికి గురై చెన్నైలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది.
మరో నాలుగు రోజుల్లో పుట్టినరోజు : మృతదేహాన్ని సాయంత్రం ఆరు గంటలకు నివాసానికి తీసుకురాగా, అక్క మృతదేహం వద్ద ఏడుస్తూ చెల్లి తులసి కన్నుమూసింది. గంటల వ్యవధిలో అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. టీవీ రిమోట్ కోసం ఇటీవల అక్క, చెల్లెలు గొడవపడ్డారు. ఆ సమయంలో నువ్వు చనిపో అని అక్క అంటే, చనిపోతే ఇద్దరం కలిసే చనిపోదామని చెల్లి అనిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరో నాలుగు రోజుల్లో యమున పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ఆమె స్నేహితులు కన్నీటి పర్యంతమవుతూ మృతదేహం వద్దే కేక్ కట్ చేశారు. ఈ ఘటనతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అందరితో ఆడుతూ పాడుతూ ఎప్పుడూ సరదాగా గడిపే అక్కాచెల్లెల్లు ఒకేసారి మృత్యువాత పడటంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
"మా తమ్ముడికి ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె యమున ఇంటర్ పూర్తై నీట్‌కు సిద్ధమవుతుండగా, రెండో కుమార్తె తులసి మానసిక దివ్యాంగురాలు. నాలుగు నెలల క్రితం యమున అనారోగ్యానికి గురై చెన్నైలో చికిత్స పొందుతూ మృతిచెందగా సాయంత్రం ఆరు గంటలకు మృతదేహాన్ని నివాసానికి తీసుకుని వచ్చాం. అక్క మృతదేహం వద్ద ఏడుస్తూ చెల్లి తులసి కన్నుమూసింది. ఇటీవలె అక్కాచెల్లెళ్లు ఇద్దరూ టీవీ రిమోట్ కోసం కొట్టుకుంటూ చనిపోవాల్సి వస్తే ఇద్దరం ఒకేసారి చనిపోదాం అని అన్నారు. కానీ నిజంగానే ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి మృతిచెంది మా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు." - పుష్పవేణి, మృతుల బంధువు
"చనిపోతే ఇద్దరం ఒకేసారి చనిపోదాం" - గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచిన అక్కాచెల్లెళ్లు (ETV Bharat) మిస్టరీగా మారిన ముగ్గురు మహిళల మృతి - హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు - Three LADIES DEAD BODIES IN POND
రూ.10 కోట్ల సాయం అందినా దక్కని చిన్నారి ప్రాణం - మరో రూ.6 కోట్లు తక్కువ పడటంతోనే! - Six Months Baby Died Fatal Disease