ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"చనిపోతే ఇద్దరం ఒకేసారి చనిపోదాం- అలానే మరణించారు"గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచిన అక్కాచెల్లెళ్లు - Two Sisters Died within Hours - TWO SISTERS DIED WITHIN HOURS

Two Sisters Died within Hours: అనారోగ్యంతో అక్క మృతి చెందటంతో తట్టుకోలేని చెల్లెలు గంటల వ్యవధిలో కన్నుమూసింది. నెల్లూరు నగరంలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన మాజీ జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Two_Sisters_Died_Within_Hours
Two_Sisters_Died_Within_Hours (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 7:38 PM IST

Updated : May 20, 2024, 9:41 AM IST

"చనిపోతేఇద్దరం ఒకేసారి చనిపోదాం-అలానేమరణించారు"గంటలవ్యవధిలో ప్రాణాలు విడిచినఅక్కాచెల్లెళ్లు

Two Sisters Died within Hours: అనారోగ్యంతో అక్క మృతిచెందటాన్ని తట్టుకోలేని చెల్లి గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచిన ఘటన నెల్లూరు నగరంలో జరిగింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమార్తెలూ ఒకే రోజు మరణించటంతో మాజీ జవాన్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

వివరాల్లోకి వెళ్తే:పటారుపల్లి చలపతినగర్​కు చెందిన మాజీ జవాన్ మల్లిఖార్జున, యామిని దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె యమున ఇంటర్ పూర్తయి నీట్​కు సిద్ధమవుతుండగా, రెండో కుమార్తె తులసి మానసిక దివ్యాంగురాలు కావటంతో ఇంట్లోనే ఉంటోంది. నాలుగు నెలల క్రితం యమున అనారోగ్యానికి గురై చెన్నైలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది.

చెరువులో అనుమానాస్పదంగా ముగ్గురు మహిళల మృతదేహాలు - ladies dead bodies found in pond

మృతదేహాన్ని సాయంత్రం ఆరు గంటలకు నివాసానికి తీసుకురాగా, అక్క మృతదేహం వద్ద ఏడుస్తూ చెల్లి తులసి కన్నుమూసింది. గంటల వ్యవధిలో అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. టీవీ రిమోట్ కోసం ఇటీవల అక్క, చెల్లెలు గొడవపడ్డారు. ఆ సమయంలో నువ్వు చనిపో అని అక్క అంటే, చనిపోతే ఇద్దరం కలిసే చనిపోదామని చెల్లి అనిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరో నాలుగు రోజుల్లో యమున పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ఆమె స్నేహితులు కన్నీటి పర్యంతమవుతూ మృతదేహం వద్దే కేక్ కట్ చేశారు. ఈ ఘటనతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అందరితో ఆడుతూ పాడుతూ ఎప్పుడూ సరదాగా గడిపే అక్కాచెల్లెల్లు ఒకేసారి మృత్యువాత పడటంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరులో హృదయ విదారక ఘటన - గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచిన అక్కాచెల్లెళ్లు (ETV Bharat)

"మా తమ్ముడికి ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె యమున ఇంటర్ పూర్తై నీట్​కు సిద్ధమవుతుండగా, రెండో కుమార్తె తులసి మానసిక దివ్యాంగురాలు. నాలుగు నెలల క్రితం యమున అనారోగ్యానికి గురై చెన్నైలో చికిత్స పొందుతూ మృతిచెందగా సాయంత్రం ఆరు గంటలకు మృతదేహాన్ని నివాసానికి తీసుకుని వచ్చాం. అక్క మృతదేహం వద్ద ఏడుస్తూ చెల్లి తులసి కన్నుమూసింది. ఇటీవలె అక్కాచెల్లెళ్లు ఇద్దరూ టీవీ రిమోట్ కోసం కొట్టుకుంటూ చనిపోవాల్సి వస్తే ఇద్దరం ఒకేసారి చనిపోదాం అని అన్నారు. కానీ నిజంగానే ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి మృతిచెంది మా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు." - పుష్పవేణి, మృతుల బంధువు

కదులుతున్న బస్సులో సడెన్​గా మంటలు- 9మంది సజీవ దహనం- మరో 24మందికి గాయాలు - Bus Fire Accident

Last Updated : May 20, 2024, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details