Two were Serious by Current Shock in Swimming Pool : హైదరాబాద్‌లో పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్విమ్మింగ్‌లో ఫూల్‌లో స్నానానికి వెళ్లిన ఓ కుటుంబ సభ్యులు విద్యుత్ఘాతానికి గురయ్యారు. దీంతో 16 మందికి గాయాలు కాగా ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉంది. నగరంలోని జల్పల్లి ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌లో ఆహ్లాదంగా గడిపేందుకు నాంపల్లి అగహాపురకు చెందిన ఓ కుటుంబం ఫాంహౌస్‌కు వెళ్లారు. అయితే వారంతా స్విమ్మింగ్ ఫూల్‌లో సరదాగా ఈత కొడుతున్న సమయంలో నీటిలో విద్యుత్ సరఫరా అయి కరెంట్ షాక్ కొట్టింది.
స్విమ్మింగ్ ఫూల్‌లో విద్యుదాఘాతం - 16 మందికి గాయాలు, ఇద్దరికి సీరియస్ - Current Shock in Swimming Pool - CURRENT SHOCK IN SWIMMING POOL
Current Shock in Swimming Pool : హైదరాబాద్‌లోని ఓ స్విమ్మింగ్ ఫూల్‌లో విద్యుదాఘాతానికి గురై 16 మందికి గాయాలు కాగా ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌లో జరిగింది.
Current Shock in Swimming Pool (ETV Bharat)
Published : Jul 11, 2024, 10:33 PM IST
ఈ ప్రమాదంలో ఫర్వేజ్, ఇలియాజ్ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలు, యువకులు కరెంట్ షాక్‌కు గురైన వారిలో ఉన్నారు. మరోవైపు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఫహడీ షరీఫ్ పోలీసులు తెలిపారు. విద్యుత్ షాక్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.