CM Chandrababu Review on Paddy Buying :ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Officers Cheating Paddy Farmers :కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో కస్టోడియల్ ఆఫిసర్, టీఏలను ఈ మేరకు సస్పెండ్ చేసింది. లారీల్లో ఎక్కువ బస్తాలు ధాన్యం లోడ్ చేస్తూ, రికార్డులు తక్కువ చూపిస్తున్న వైనంపై బుధవారం సీఎం చంద్రబాబు చిట్ చాట్‌లో మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళారు. సీఎం దీనిని సీరియస్‌గా తీసుకోవటంతో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ శాఖాపర చర్యలకు ఆదేశించి సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు.
మిల్లర్లతో ధర మీరే మాట్లాడుకోండి :కృష్ణా జిల్లా పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలు జరిగాయి. లారీల్లో ఎక్కువ బస్తాలు ధాన్యం లోడ్ చేస్తూ, రికార్డులు తక్కువ చూపిస్తున్న వైనం నెలకొంది. మిల్లర్లతో ధర మీరే మాట్లాడుకోండంటూ ఎమ్మార్వో స్థాయి అధికారులు మాట్లాడుతున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 34వేల రూపాయలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు - మిల్లర్లు కుమ్మక్కై రైతుల్నిమోసగిస్తున్నారని రైతుల మండిపడ్డారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి, అధికారులు రికార్డుల్లో తక్కువ చూపిస్తున్నారని ఆక్షేపించారు. ఈ చర్యతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు.
ధాన్యం కోతలు ముమ్మరం - మందగించిన కొనుగోళ్లతో రైతుల అవస్థలు
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు :పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటీవీ ద్వారా సీఎం వివరాలను పరిశీలించారు. లారీలో 315 బస్తాలు లోడ్ చేసి రికార్డుల్లో మాత్రం 290 చూపుతున్నారని మీడియా ప్రతినిధులు ఆధారాలు చూపించగా వాటిని పరిశీలించి, తన వాట్సప్‌కు పంపాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. రాత్రి ఆయన నివాసంలో రైతు సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు క్రమం తప్పకుండా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.