TTD Released Srivari Arjitha Seva Tickets for February 2025 :భక్తుల సౌకర్యార్థం 2025 ఫిబ్రవరికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్ల కోటాను టీటీడీ గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
ఈ నెల 25వ తేదీ ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in లో నమోదు చేసుకోవాలని సూచించారు.