ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ మరోసారి పొడిగింపు - ఫిర్యాదులను పట్టించుకోని కేంద్రం - DHARMA REDDY DEPUTATION EXTENDED - DHARMA REDDY DEPUTATION EXTENDED

TTD EO DHARMA REDDY DEPUTATION EXTENDED: టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. జూన్ 30 వరకు ఈవోగా కొనసాగేలా ఉత్తర్వులిచ్చింది. సీఎం జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన్ను తక్షణం బదిలీ చేయాలని ఈసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల ఫిర్యాదు చేశారు. కానీ వీటిని పట్టించుకోని కేంద్ర రక్షణ శాఖ, ఆయన డిప్యుటేషన్‌ను పొడిగించాలని సీఎం జగన్‌ లేఖ రాసిన వెంటనే ఆమోదముద్ర వేసింది.

ttd eo dharmareddy
ttd eo dharmareddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 7:47 AM IST

Updated : Apr 29, 2024, 8:43 AM IST

TTD EO DHARMA REDDY DEPUTATION EXTENDED: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని, వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా ఈసీ పట్టించుకోలేదు. కానీ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్​కు చెందిన ఏవీ ధర్మారెడ్డి అనే అధికారి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా లేక పోతే వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోతుందని, భక్తులకు దర్శనాలు చేయించడమే కష్టమవుతుందని సీఎం జగన్ ఒక లేఖ రాసిందే తడవు, మరొకమాట లేకుండా ధర్మారెడ్డి డిప్యూటేషన్ గడువును పొడిగిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసేసింది. ధర్మారెడ్డి డిప్యుటేషన్ మే 14తో ముగుస్తుండగా, ఈ ఏడాది జూన్ 30న ఆయన పదవీ విరమణ చేసేంత వరకు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) ఈవోగా కొనసాగేలా 6 వారాల పాటు గడువు పొడిగించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ పరిణామం అద్దం పడుతోంది.

ఆయనే కావాలి - ధర్మారెడ్డి డిప్యుటేషన్​ పొడిగించాలని కేంద్రానికి జగన్​ లేఖ - CM Jagan on TTD EO Deputation

సర్వాధికారాలూ తన చేతిలో పెట్టుకొని:రాష్ట్రంలో పదుల సంఖ్యలో సీనియర్ ఐఏఎస్ అధికారులుండగా, వారందరినీ కాదని, డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసుకు చెందిన ఒక అధికారిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి అత్యంత కీలకమైన టీటీడీ ఈవో పోస్టు కట్టబెట్టడమే ఆభ్యంతరకరమైతే, ఆయన లేకపోతే అసలు తిరుమల స్తంభించిపోతుందన్నట్టుగా డిప్యుటేషన్​ను పొడిగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీటీడీ ఈవోగా, టీటీడీ పరిధిలోని పలు సంస్థలకు డైరెక్టర్‌గా ఏకకాలంలో వివిధ పోస్టులు నిర్వహిస్తూ సర్వాధికారాలూ తన చేతిలో పెట్టుకొని చక్రం తిప్పుతున్నధర్మారెడ్డి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు.

జగన్‌కు ధర్మారెడ్డి నమ్మిన బంటని, ఆయన దిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో పనులు చేసి పెడతారని, కేంద్ర ఎన్నికల సంఘం వంటి సంస్థల్లోనూ పలుకుబడి ఉపయోగిస్తారని, 'అతి సున్నితమైన' వ్యవహారాల్ని కూడా సీఎం కోసం సునాయాసంగా చక్క బెడతారని పేరుంది. ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా కొనసాగితే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని, ఆయన్ను తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్ని కల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల ఫిర్యాదు చేశారు. కానీ కేంద్ర రక్షణ శాఖ మాత్రం ఆయన డిప్యుటేషన్‌ను పొడిగించి, ఈఓగా కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది.

భూమన కరుణాకర్​రెడ్డిని టీటీడీ ఛైర్మన్​ పదవి నుంచి తప్పించాలి - ఈసీకి బీజేపీ ఫిర్యాదు - BJP Complaint on Bhumana

డిప్యుటేషన్​ను పొడిగించాలంటూ జగన్​ లేఖ: ధర్మారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఇది వరకే పొడిగించిన రెండేళ్ల డిప్యుటేషన్ గడువు వచ్చే నెల 14తో ముగుస్తోంది. ఈ ఏడాది జూన్ 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. లెక్క ప్రకారం ఆయన మే 14వ తేదీన కేంద్ర సర్వీసుకు తిరిగి వెళ్లిపోవాలి. కానీ తన ఆత్మబంధువు లాంటి ధర్మారెడ్డిని వదులుకోవడానికి సిద్ధంగా లేని జగన్, జూన్ 30న ఆయన పదవీ విరమణ చేసేంత వరకు, డిప్యుటేషన్​ను పొడిగించాలంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మార్చి 12న లేఖ రాశారు.

తిరుమలలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, మే, జూన్ నెలల్లో సర్వదర్శనానికి 30 గంటల కంటే ఎక్కువ సమయం కూడా పడుతుందని అందులో పేర్కొన్నారు. అన్ని గంటలపాటు వేచి ఉండాల్సి రావడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురవుతారు కాబట్టి, వారికి ఆహారం, రవాణా, వసతి, వైద్య సదుపాయాలు కల్పించడంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ ఆ లేఖలో వెల్లడించారు. ధర్మారెడ్డి అయితేనే ఆ పనులు సజావుగా, సమర్థంగా చేయగలరని వివరించారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించాలి - సీఈవోకి కూటమి నేతల ఫిర్యాదు - Complaint on TTD EO Dharma Reddy

Last Updated : Apr 29, 2024, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details