TTD Chairman BR Naidu meets CM Chandrababu :తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీ ఛైర్మన్ బీర్ నాయుడు తెలిపారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో బీఆర్ నాయుడు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చించారు. వారానికి నాలుగు సిఫార్సు లేఖలు అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలిపారు. వారానికి రెండు బ్రేక్ దర్శనం, రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
Chandrababu Letter to CM Revanth Reddy :తిరుమల శ్రీవారి దర్శనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలనే ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. తెలుగు జాతి సత్సంబంధాల కోసం అనుమతులు మంజూరు చేయుటకు ఆదేశాలు ఇచ్చామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.