TTD Arrangements For Parking Of Vehicles :తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడసేవ నాడు అక్టోబరు 8వ తేదీన ప్రైవేటు వాహనాలను అధికారులు కొండపైకి అనుమతించడం లేదు. ఈ తరుణంలో భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రచారం, ఏర్పాట్లు చేశారు. అలిపిరికి సమీపంలోని భారతీయ విద్యాభవన్, నెహ్రూ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానం, వినాయకనగర్ క్వార్టర్స్, ఎస్వీ వైద్య కళాశాల మైదానంలో వాహనాలు నిలిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
టూరిస్టు బస్సులకు జూ మార్గంలోని దేవలోక్ మైదానం, ద్విచక్రవాహనాలకు బాలాజీ లింకు బస్టాండ్ పరిధిలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ప్రదేశాల వివరాలు, వాటికి చేరుకునే మార్గాల వివరాలతో రుయా, గరుడ కూడలి, బాలాజీ లింకు బస్టాండ్ వద్ద టీటీడీ క్యూఆర్ కోడ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీలో ఉన్న ప్రదేశం వద్ద సెల్‌ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లొకేషన్, రూట్‌మ్యాప్ కనిపిస్తుంది.
ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్:
- అక్టోబర్ 3వ తేదీ గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన
అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం- మొదటిరోజు:
- మధ్యాహ్నం: 3.30 నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం
- సాయంత్రం: సుమారు 6 గంటలకు ద్వజారోహణం (ధ్వజారోహణం)
- రాత్రి: 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం
అక్టోబర్ 5వ తేదీ శనివారం- రెండోరోజు:
- ఉదయం: 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన శేష వాహనం
- మధ్యాహ్నం: ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం(ఉత్సవర్లకు అభిషేకం)
- రాత్రి: 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనం
అక్టోబర్ 6వ తేదీ ఆదివారం- మూడోరోజు:
- ఉదయం: 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహవాహనం
- మధ్యాహ్నం: ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం)
- రాత్రి: 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యాల పల్లకీ వాహనం (ముత్యపు పందిరి వాహనం)