TSRTC Employees PRC 2024 :టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ఇస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బస్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిట్‌మెంట్ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్‌మెంట్(New Fitment) అమలవుతుందని స్పష్టం చేశారు.
2017లో నాటి ప్రభుత్వం 16 శాతం పీఆర్సీ ఇచ్చిందని, మళ్లీ ఇవ్వలేదన్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుందని కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అందుకే ఈసారి ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, సంస్థపై ఆర్థిక భారం పడుతున్నా, ఉద్యోగుల సంక్షేమానికి(Welfare of Employees) ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఫిట్‌మెంట్‌ను అందజేస్తున్నామన్నారు.
ఈనెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం
"2017 ఏడాదిలో నాటి ప్రభుత్వం 16 శాతం పీఆర్సీ ఇచ్చింది. అనంతరం దాదాపు 8 సంవత్సరాలు గడిచినా, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ దాని నుంచి ఎలా బయటపడాలనే ఆలోచన చేశాం. ఏదేమైనప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది." - పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ - పీఆర్సీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం Congress Govt Announce PRC For RTC Employees :21 శాతం ఫిట్‌మెంట్ పెంచడం వల్ల సంస్థపై నెలకు రూ.35 కోట్ల భారం, ఏడాదికి సంస్థ పై రూ.418.11 కోట్ల భారం పడుతుందన్నారు. కండక్టర్లకు, డ్రైవర్లకు, సూపర్ వైజర్లకు అందరికీ జీతం పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పే స్కేల్ - 2017(Pay Scale – 2017) సర్వీస్‌లో ఉన్న 42,057 మంది ఉద్యోగులకు, 01-ఏప్రిల్-2017 నుంచి పదవీ విరమణ చేసిన 11,014మంది ఉద్యోగులకు, మొత్తం 53,071 మంది ఉద్యోగులకు ఈ ఫిట్‌మెంట్‌తో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందన్నారు. ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళలు(MahaLakshmi Scheme) ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 21శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Minister Ponnam on TSRTC PRC :అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రెండు రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 48 గంటలు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందటంతో ఉద్యోగులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి - ఎంపీ అభ్యర్థులకు సీఎం రేవంత్ కీలక సూచనలు
4 వివాదరహిత స్థానాలకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన - మిగిలిన సీట్లపై కాంగ్రెస్ కసరత్తు