Telangana Medical Council Caught Fake Doctor on Instagram : ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో డాక్టర్లు వీడియోలు చేస్తూ ఆరోగ్య అలవాట్లు, పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాంటి వారికి ఫాలోవర్స్ ఎక్కువే. ప్రజలు కూడా వారు నిజం డాక్టర్ల లేదా అన్న విషయం పక్కన పెట్టి చెప్పిందల్లా నమ్మేస్తుంటారు. దాన్నే ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి డాక్టర్ అవతారం ఎత్తాడు. సామాజిక మాధ్యమాల్లో ప్రజల నాడి పట్టేసి, వ్యూస్, లైక్‌ల కోసం 'ఆల్ ఇన్ వన్ రామ్' పేరుతో అన్ని జబ్బులకు శాస్త్రీయత లేని సలహాలు ఇస్తున్నాడు. ఇతని సలహాలు పాటించిన కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయి.
'ఆల్ ఇన్ వన్ రామ్' సలహాలు వింటున్నారా - అయితే మీ ఆరోగ్యం ఒకసారి చెక్ చేసుకోండి!
నకిలీ డాక్టర్‌ను పట్టుకున్న తెలంగాణ వైద్యమండలి - సోషల్ మీడియాలో శాస్త్రీయత లేని సలహాలు ఇస్తున్న ఫేక్ డాక్టర్
Published : 4 hours ago
|Updated : 4 hours ago
వేములవలస రాంబాబు అనే నకిలీ వైద్యుడిని తెలంగాణ వైద్య మండలి వైస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఇమ్రాన్లు పట్టుకున్నారు. మూడు నెలలుగా ఇతడి తీరును పరిశీలించిన వారు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పట్టుకున్నారు. రాంబాబు ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ద్వారా ప్రజలను మోసం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నకిలీ డాక్టర్‌పై ఎన్ఎంసీ చట్టం 34, 54 కింద ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వారి సలహాలు, సూచనలు పాటించవద్దని సూచించారు.
మత్తు ఇంజక్షన్ల 'ఛీ'కటి దందా - ఫెంటనిల్ ఇంజక్షన్ల మాఫియా కేసులో సంచలన విషయాలు