Tourism Not Developed in YSRCP Government :ఏటా డిసెంబరులో మూడు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవాల వీక్షణకు అనేక ప్రాంతాల నుంచి లక్షల మంది వచ్చేవారు. భీమిలి, అరకు ఉత్సవాల వంటివి కూడా నిర్వహించి పర్యాటకానికి టీడీపీ కొత్త రూపురేఖలు తీసుకొచ్చింది. జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని పట్టించుకున్న దాఖలాలే లేవు. 2019లో మినహా మరెప్పుడూ నిర్వహించలేదు.
YSRCP Failed to Develop Tourism in Visakha :2017, 2018 సంవత్సరాల్లో జిల్లాకు రెండు కోట్ల మందికి పైగా సందర్శకులు వస్తే వైఎస్సార్సీపీ అయిదేళ్ల పాలనలో ఎప్పుడూ ఆ సంఖ్య దాటలేదు. విదేశీయులైతే ఇప్పుడు కనిపించడమే అరుదు. టీడీపీ హయాంలో ఓ ట్రావెల్ సంస్థకు ఏడాదికి రూ.కోటి వ్యాపారం సాగితే వైఎస్సార్సీపీ వచ్చాక రూ.30 లక్షల వ్యాపారం కూడా జరగలేదు. అలాగే టూరిజం ప్యాకేజీలు నిర్వహించే ఓ సంస్థకు ఏటా రూ.50 లక్షల వ్యాపారం జరగ్గా ఈ అయిదేళ్లు కలిపినా ఆ మొత్తం దాటలేదంటే పర్యాటకరంగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
జగన్ హయాంలో పర్యాటక రంగం కుదేలు- పెట్టుబడులకు ప్రైవేటు సంస్థల వెనకంజ - YSRCP Not developing tourism
నగరానికి ఆయువు పట్టులాంటి పర్యాటక రంగంపై శీతకన్నేయడంతో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు దూరమయ్యాయి. ఈ రంగంపై ఆధారపడిన అనుబంధ రంగాలు కుదేలయ్యాయి. టీడీపీ హయాంలో మొదలైన పలు నిర్మాణాలను వైఎస్సార్సీపీ అసంపూర్తిగా వదిలేసింది. రుషికొండపై రాజసౌధంలాంటి నిర్మాణం కట్టుకోవడం మినహా చేసిందేమీ లేదు. ఇలాంటి ప్రభుత్వానికి ఎన్నికల్లో తగు తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని జనం చెబుతున్నారు.
రిసార్టులు అస్తవ్యస్తం : విశాఖ డివిజన్ కేంద్రంగా పర్యాటకశాఖకు చెందిన రిసార్టులు అధ్వానంగా మారాయి. టైడా, అరకు, అనంతగిరిలోని రిసార్టుల గదులు చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. అందులో ఉండేందుకు సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వచ్చిన పర్యాటకులు మళ్లీ రావాలంటే సంకోచిస్తున్నారు. కొద్ది రోజుల కిందట అప్పూఘర్ వద్ద భవనాల నవీకరణ పేరుతో హడావుడి చేసి వదిలేశారు.