తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు - సినీ ప్రముఖులకు తేల్చి చెప్పిన సీఎం - TOLLYWOOD CELEBRITIES MEET CM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీలో సినీ ప్రముఖులు - సుమారు 50 మందికి పైగా సినీ ప్రముఖులు సమావేశం - చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చర్చ

Tollywood Celebrities Meet CM
Tollywood Celebrities Meet CM Revanth Reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2024, 11:43 AM IST

Updated : Dec 26, 2024, 1:50 PM IST

Tollywood Celebrities Meet CM Revanth Reddy: ఇకపై బెనిఫిట్​ షోలు ఉండవని సీఎం రేవంత్​ రెడ్డి సినీ ప్రముఖులకు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంటుందన్నారు. అభిమానుల్ని కంట్రోల్​ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలన్నారు.

ఆలయ పర్యటకం, ఎకో టూరిజంను ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇన్వెస్ట్​మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని కోరారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్​గా ఉంటామని హెచ్చరించారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లోని కమాండ్​ కంట్రోల్​ కేంద్రంగా ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి పాల్గొన్నారు. ఎఫ్​డీసీ ఛైర్మన్​ దిల్​ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు.

సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం : సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టికెట్​ ధరలు, బెనిఫిట్​ షోలపై చర్చించి నిర్ణయించాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. అలాగే సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించి నిర్ణయించాలన్నారు. సినీ పరిశ్రమ తరఫున సీఎంకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి వినతి పత్రం అందించింది.

మీడియాతో మాట్లాడిన ఎఫ్​డీసీ ఛైర్మన్​ దిల్​ రాజు :హైదరాబాద్​ను సినీ పరిశ్రమకు అంతర్జాతీయ హబ్​గా చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎఫ్​డీసీ ఛైర్మన్​ దిల్​ రాజు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్​ ఉందనే అపోహలున్నాయన్నారు. సినీ పరిశ్రమ అంశాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తెచ్చామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ అంశాలను మరోసారి భేటీలో చర్చిస్తామన్నారు. టికెట్​ ధరలు, బెనిఫిట్​ షోలు అనేవి చిన్న విషయాలని దిల్​ రాజు పేర్కొన్నారు. ఎఫ్​డీసీ ఆధ్వర్యంలో సీఎంతో భేటీ జరిగిందన్నారు.

తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో స్పందన వస్తోందని ఎఫ్​డీసీ ఛైర్మన్​ దిల్​ రాజు తెలిపారు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని రేవంత్​ రెడ్డి చెప్పారని వివరించారు. సినీ పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పని చేయాలని రేవంత్​ రెడ్డి చెప్పారన్నారు. హైదరాబాద్​లో హాలీవుడ్​ చిత్రీకరణలు జరిగేందుకు సలహాలు కోరారన్నారు. చిత్రీకరణలకు ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏర్పాట్ల గురించి అడిగారని దిల్​ రాజు చెప్పారు. ఎఫ్​డీసీలో చర్చించి తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇస్తామని దిల్​ రాజు వెల్లడించారు.

సీఎంతో మాట్లాడిన సినీ ప్రముఖులు :

హైదరాబాద్​ ప్రపంచ సినిమా రాజధాని కావాలి :ప్రభుత్వం మూలధన పెట్టుబడులు కల్పిస్తేనే మన సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదిగిందని సీఎంతో సినీ హీరో నాగార్జున తెలిపారు. హైదరాబాద్​ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేది మా కోరిక అని చెప్పారు. యూనివర్సల్​ లెవల్​లో స్టూడియో సెటప్​లు ఉండాలన్నారు. సీఎంతో దర్శకుడు త్రివిక్రమ్​ మాట్లాడుతూ.. మర్రి చిన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్​కు వచ్చిందని గుర్తు చేశారు.

అంతర్జాతీయ ఫిల్మ్​ ఫెస్టివల్​ జరగాలి : అందరూ సీఎంలు సినీ పరిశ్రమను బాగానే చూసుకున్నారని దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం సినీ పరిశ్రమను బాగా చూసుకుంటోందన్నారు. హైదరాబాద్​లో అంతర్జాతీయ ఫిల్మ్​ ఫెస్టివల్​ నిర్వహించాలని కోరుతున్నామని రాఘవేంద్రరావు సీఎం రేవంత్​ రెడ్డికి సూచించారు. ఎఫ్​డీసీ ఛైర్మన్​గా దిల్​ రాజును నిర్మించడంపై సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోందని సీఎంతో తెలిపారు.

సంధ్య థియేటర్​ ఘటన మమ్మల్ని బాధించింది : ఎన్నికల ఫలితాల మాదిరిగానే సినిమా రిలీజ్​ ఫస్ట్​ డే ఉంటుందని సీనియర్​ నటుడు మురళీమోహన్​ అన్నారు. సంధ్య థియేటర్​ ఘటన మమ్మల్ని బాధించిందన్నారు. సినిమా రిలీజ్​లో పోటీ వల్లే ప్రమోషన్​ కీలకంగా మారిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్​ ఉండటం వల్ల ప్రమోషన్​ విస్త్రతంగా చేస్తున్నామని సీఎంతో మురళీమోహన్​ వివరించారు.

చిన్న విషయాలను పట్టించుకోవద్దు : నేను చిన్నప్పటి నుంచి పరిశ్రమను చూస్తున్నానని, హైదరాబాద్​ను మరో స్థాయికి తీసుకెళ్లాలని నిర్మాత శ్యాంప్రసాద్​ రెడ్డి కోరారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని సీఎంతో నిర్మాత శ్యాంప్రసాద్​ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది : ప్రభుత్వంపై మాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని నిర్మాత దగ్గుబాటి సురేశ్​ బాబు తెలిపారు. ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్​కు వచ్చిందని గుర్తు చేశారు. నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్​నే కేరాఫ్​ అడ్రస్​గా ఉండాలని సూచించారు. హైదరాబాద్​ను ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ డెస్టినేషన్​ చేయాలనేది మా కల అని సీఎంతో నిర్మాత దగ్గుబాటి సురేశ్​ బాబు తెలిపారు.

భేటీలో పాల్గొన్న సినీ ప్రముఖులు : అల్లు అరవింద్​, సురేశ్​బాబు, మైత్రి రవి, నవీన్​, నాగవంశీ, సి. కల్యాణ్​, గోపీ ఆచంట, శ్యామ్​ ప్రసాద్​ రెడ్డి, సుధాకర్​ రెడ్డి, నాగార్జున, వెంకటేశ్​, నితిన్​, కిరణ్​ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, త్రివిక్రమ్​, కొరటాల శివ, వంశీ పైడితల్లి, అనిల్​ రావిపూడి, బోయపాటి శ్రీను, వీర శంకర్​, హరీశ్​ శంకర్​, ప్రశాంత్​ వర్మ, సాయి రాజేశ్​, వశిష్ఠ, బీవీఎస్​ ప్రసాద్​, కె.ఎల్​. నారాయణ, రాఘవేంద్రరావు, మురళీమోహన్, స్రవంతి రవి కిశోర్​, యూవీ వంశీ​, రామ్​ పోతినేని, కల్యాణ్​ రామ్​, శివ బాలాజీ, అడవి శేషు, వరుణ్​ తేజ్​, సాయి ధరణ్​ తేజ్, బలగం వేణు, వి. విజయేంద్ర ప్రసాద్​, పవర్​ బాబీ, వేణు శ్రీరామ్​, డీవీవీ దానయ్య, చినబాబు, తదితరులు సీఎంతో చర్చిస్తున్నట్లు సమాచారం.

ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు - టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఉండదు! : మంత్రి కోమటిరెడ్డి

సందేశాత్మక, దేశభక్తి చిత్రాలకే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి: కోమటిరెడ్డి

Last Updated : Dec 26, 2024, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details