ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి, 13మందికి గాయాలు - రోడ్డు ప్రమాదం

RTC Bus Auto Accident : పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 13మంది తీవ్రంగా గాయపడ్డారు. మిర్చి కోత కూలీలతో వెళ్తున్న ఆటో, బస్సు ఢీకొని రోడ్డు పక్కన బోల్తా కొట్టాయి. ప్రమాదస్థలి భీతావహంగా మారింది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 1:50 PM IST

Updated : Jan 26, 2024, 2:04 PM IST

RTC Bus Auto Accident : గణతంత్ర దినోత్సవం రోజున పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో 13 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

యూపీలో ఘోర ప్రమాదం- ట్యాంకర్, ఆటో ఢీ- 12 మంది మృతి

చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో మిర్చి కోతలకు ఆటోలో వస్తుండగా అదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిలకలూరిపేట వైపు వెళ్తోంది. ఈ క్రమంలో లింగంగుంట్ల బస్ స్టాప్ వద్ద గణపవరం రోడ్డు నుంచి ఒక్కసారిగా ఆటో చిలకలూరిపేట రోడ్డులోకి వచ్చింది. ఇది గమనించిన ఆర్టీసీ డ్రైవర్ ఆటోని తప్పించే ప్రయత్నం చేసినప్పటికే బస్సు ఢీ కొట్టింది. బస్సు రోడ్డు పక్కన పొలాల్లో బోల్తా పడింది. బస్సు కింద పడి ఆటో నుజ్జు అయింది.

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - మినీ లారీ, కారు ఢీకొని ముగ్గురు మృతి

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15మంది వ్యవసాయ కూలీలలో యాకసిరి హనుమాయమ్మ(60) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ సహా క్షతగాత్రులైన 14 మందిని వ్యవసాయ కూలీలను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లలో తరలించారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించే లోపే గన్నవరపు శివపార్వతి(58) మృతి చెందింది. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న షేక్ హజరత్ వలి(65) ని గుంటూరు తరలించి జీజీహెచ్ లో చికిత్స అందించే లోపే మృతి చెందాడు. గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరు గోరంట్ల శివకుమారి(60), సురుగుల కోటేశ్వరమ్మ(60)ను మెరుగైన వైద్యం కోసం వివిధ ఆస్పత్రులకు పంపించారు.

గాయపడిన షేక్ సుభాని ఆటో డ్రైవర్ (45) సహా మరో 11 మంది పాలెపు రజని(42), సట్టు పార్వతి(39), షేక్ వహీదా(32), బేతంచెర్ల మల్లేశ్వరి(45), పాలెపు శారద(23), ఎస్ కే జాన్ బి40), ఎస్. కె.ఖాదర్ బి(37), ఎస్.కె మహబూబి(52), ఎస్. కె .మస్తాన్ బి(35) ఎస్ కే బాజీ(14)లకు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై లు రవి కృష్ణ, బాలకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతులు, క్షతగాత్రుల బంధువుల రోదనలతో విషాదం నెలకొంది.

బ్రిడ్జిపై ఒకేసారి ఐదు వాహనాలు ఢీ- ముగ్గురు సజీవ దహనం

Last Updated : Jan 26, 2024, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details