OATS MASALA VADA RECIPE IN TELUGU : మసాలా వడ (Oats Masala wada) కంటే ఓట్స్ ని కలిపి చేసే మసాలా వడ చూడడానికే కాదు ఎంతో రుచిగా కూడా ఉంటుంది. సాయంత్రం వేళలో స్నాక్స్ కోరుకునే వారు మసాలా ఓట్స్ వడ ఒక్క సారి రుచి చూస్తే చాలు. పైన కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. తక్కువ నూనె పీల్చుకోవడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసేవే.
హోటల్ స్టైల్లో రవ్వ ఊతప్పం - ఈజీగా అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు!
ఓట్స్ మసాలా వడ తయారీకి కావాల్సిన పదార్థాలు
- పచ్చి శెనగపప్పు - అర కప్పు
- (2గంటలు నానబెట్టాలి)
- ఓట్స్ - ముప్పావు కప్పు
- ఉల్లిపాయ తరుగు - అర కప్పు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ధనియాలు -1 టేబుల్ స్పూన్
- ఉప్పు - తగినంత
- పచ్చిమిర్చి తరుగు - కొద్దిగా
- కారం - 1 టేబుల్ స్పూన్
- నీళ్లు - తగినన్ని
- నూనె - వేయించుకోవడానికి
కొంత మంది ఆరుబయట మిర్చీ బండీల వద్ద కనిపించే పదార్థాలు ఎంతో ఇష్టపడుతుంటారు. మిర్చి బజ్జీతో పాటు ప్రత్యేకించి వడలు (వీటినే కొన్ని ప్రాంతాల్లో గారెలు అని కూడా అంటారు) కనిపిస్తే చాలు మనసును చంపుకోలేరు. వెంటనే ఓ ప్లేట్ వడ అంటూ ఆర్డర్ ఇచ్చేస్తుంటారు. పైకి కరకరలాడే రుచి లోపల మెత్తగా మృదువుగా ఉండే ఇవి చిరుతిండి ప్రియుల నోరూరిస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి రుచినే కొన్ని సింపుల్ టిప్స్ పాటించి పొందే వీలుంది.
ఓట్స్ మసాలా వడ తయారీ విధానం
- ముందుగా శెనగపప్పును 2గంటల పాటు నానబెట్టుకుంటే 80శాతం మెత్తగా అవుతుంది. ఆ తర్వాత నీళ్లలో నుంచి తీసి గట్టిగా, కొంచెం బరకగా మిక్సీ పట్టాలి.
- మిక్సీ పట్టిన పిండి ముద్ద లోకి మిగిలిన పదార్థాలు వేసుకుని గట్టిగా పిండుతూ కలుపుకోవాలి.
- ఆ తరువాత అవసరాన్ని బట్టి చెంచాలతో నీళ్లు పోసుకుంటూ పిండి, ముద్దగా అయ్యేదాకా కలపాలి.
- కడాయిపై మూకుడు పెట్టుకుని నూనె వేడయ్యాక వడల మాదిరిగా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేం మీద పెట్టి ఎర్రగా కరకరలాడేదాక వేయించుకుంటే ఓట్స్ మసాలా వడలు రెడీ!
- ఓట్స్ మసాలా వడలు వేడి వేడిగా అల్లం పచ్చడి తో చాలా రుచిగా ఉంటాయి.
బాలీవుడ్ బ్యూటీ కొత్త రెసిపీ - నెట్టింట వైరల్‌గా మారిన 'కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ'
గుడ్లు లేకుండానే టేస్టీ 'ఎగ్ బుర్జీ'! - సింపుల్ టిప్స్‌తో ఇలా చేసేయండి