అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం - ముగ్గురు భక్తులు మృతి - THREE KILLED ELEPHANT ATTACK IN AP
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడి - ముగ్గురు భక్తులు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

Published : Feb 25, 2025, 8:12 AM IST
|Updated : Feb 25, 2025, 8:49 AM IST
Three killed In Elephant Attack In AP : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా, వారిపై ఏనుగులు దాడి చేశాయి. దీనిపై అటవీ అధికారులు స్పందించి ఘటనపై ఆరా తీస్తున్నారు.