Man Who Killed 6 Women :మాయమాటలు చెప్పి ఆరుగురు మహిళలను దారుణంగా హత్య చేసిన యువకుడు పోలీసులకు చిక్కాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం తన కార్యాలయంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన బోయ కాసమయ్య అలియాస్ ఖాసీం(25) పొట్టకూటి కోసం కూలీగా పని చేస్తుండేవాడు. అతడు మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటు పడ్డ అతడు రెండున్నరేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు మకాం మార్చాడు. కూలి పనులు చేయగా వచ్చిన డబ్బును మద్యానికి, తిండికి ఖర్చు పెట్టేవాడు. బస్టాండ్ల దగ్గర, ఫుట్‌పాత్‌లపై పడుకునేవాడు. కూలీలు, అమాయకులైన మహిళలే లక్ష్యంగా మాయమాటలు చెప్పి, డబ్బులు ఇస్తానని నమ్మించి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరకంగా అనుభవించేవాడు. తర్వాత డబ్బులు ఇవ్వకుండా చంపేవాడు.
ఆరుగురు మహిళలను వివిధ ప్రాంతాల్లో హత్య చేసి :ఈ విధంగా ఆరుగురు మహిళలను వివిధ ప్రాంతాల్లో హత్య చేశాడు. మే 23న మహబూబ్‌నగర్ పట్టణం పరిధిలోని టీడీగుట్టలోని కూలీల అడ్డా నుంచి ఓ మహిళను కాసమయ్య తన వెంటబెట్టుకొని భూత్పూర్ పురపాలిక అమిస్తాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెను లొంగదీసుకుని శారీరకంగా అనుభవించాడు. అనంతరం ఆమె డబ్బులు ఇవ్వాలని అడగ్గా తన వద్ద ఉన్న టవల్‌ను ఆమె మెడకు చుట్టి బ్లేడుతో గొంతు కోశాడు. రాయితో ముఖంపై మోదీ చంపేసి ఆమె కాళ్లకు ఉన్న పట్టీలను కాజేసి పరారయ్యాడు.