తెలంగాణ

telangana

ETV Bharat / state

అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త - 3 రోజుల టూర్​ ప్లాన్​తో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - TGSRTC ARUNACHALAM TOUR PACKAGE

కార్తిక పౌర్ణమి సంద‌ర్భంగా అరుణాచలం వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభ‌వార్త - అరుణాచ‌లం గిరి ప్రద‌క్షిణ కోసం టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఆర్టీసీ

TGSRTC ARUNACHALAM TOUR
TGSRTC announced Special Buses Services to Arunachalam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 10:52 PM IST

TGSRTC announced Special Bus Services to Arunachalam :దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అరుణాచ‌లానికి కార్తిక మాసంలో భారీ సంఖ్యలో భక్తులు వెళుతారు. తిరువణ్ణామలైగా ప్రసిద్ధి చెందని ఆ ఆలయాన్ని సందర్శించి పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని భక్తలు విశ్వాసం. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో కార్తిక పౌర్ణమి సంద‌ర్భంగా అరుణాచ‌లేశ్వరుని గిరి ప్రదక్షిణ‌కు వెళ్లే భ‌క్తుల‌కు టీజీఎస్ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. ప‌ర‌మ‌శివుడి ద‌ర్శనం కోసం తెలంగాణ ఆర్టీసీ అరుణాచ‌లం గిరి ప్రద‌క్షిణ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

అంతేకాకుండా కాణిపాకం వ‌ర‌సిద్ధి వినాయ‌క‌స్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించే సౌక‌ర్యాన్ని టీజీఎస్ఆర్టీసీ క‌ల్పిస్తోంది. తెలంగాణ‌లోని హైద‌రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెద‌క్, న‌ల్లగొండ‌, వరంగ‌ల్, క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప్రాంతాల నుంచి అరుణాచ‌లానికి ఆర్టీసీ ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బ‌స్సులు బ‌య‌లుదేరనున్నాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ ద‌ర్శనం త‌ర్వాత కార్తిక పౌర్ణమి పర్వదినం నాడు అరుణాచ‌లానికి చేరుకుంటాయి. అరుణాచ‌ల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవ‌చ్చని అధికారులు తెలిపారు. పూర్తి వివ‌రాల‌కు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-23450033, 040-69440000 సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

30-40 మంది భక్తులుంటే అడిగిన తేదీల్లో పుణ్యక్షేత్రాలకు బస్సులు : అద్దె ప్రాతిపదిక‌న తీసుకునే ఆర్టీసీ బ‌స్సు ఛార్జిలు సైతం తగ్గించినట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప‌ల్లె వెలుగు బస్సుకు కిలోమీట‌ర్‌కు 11 రూపాయలు తగ్గించగా ఎక్స్​ప్రెస్ రూ.7, డీల‌క్స్ 8 రూపాయలు తగ్గించినట్లు వివరించారు. సూప‌ర్ ల‌గ్జరీకి రూ. 6, రాజ‌ధాని 7 రూపాయల వరకు త‌గ్గించిన‌ట్లు చెప్పారు. ఇప్పటికే శ్రీశైలం, వేముల‌వాడ, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్ట, త‌దిత‌ర ఆలయాలకు హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఏపీలో పంచారామాల‌కు ప్రతి సోమ‌వారం ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు పేర్కొన్నారు. 30-40 మంది భక్తులు ఉంటే వారు అడిగిన తేదీల్లో కూడా పుణ్యక్షేత్రాలకు బస్సులు సమకూర్చుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? - తెలంగాణ ఆర్టీసీ సూపర్​ ఆఫర్ - మీ ఇంటికే బస్సు

కార్తికమాసం స్పెషల్​ - అరుణాచలం TO తంజావూర్ - రూ.14వేలకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

ABOUT THE AUTHOR

...view details