Junior Lecturers Provision List Release :తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలను ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పడు వాటికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ,సంస్కృతం జూనియర్ లెక్చరర్ల ప్రొవిజన్ లిస్టును అధికారిక వెబ్‌సైట్లో టీజీపీఎస్సీ పొందుపరిచింది. వీటితో పాటు ఉర్దూ మీడియంలో ఉర్దూ, ఫిజిక్స్ సబ్జెక్టులకు ఎంపికైన వారి వివరాలు విడుదల చేసింది. కాగా ఎంపికైన వారి విడుదల చేసిన టీజీపీఎస్సీ https://www.tspsc.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలను పెట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో జూనియర్ లెక్చరర్ల లిస్ట్ - JUNIOR LECTURERS PROVISION LIST
ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ,సంస్కృతం జూనియర్ లెక్చరర్ల ప్రొవిజన్ లిస్ట్ విడుదల - https://www.tspsc.gov.in లో పూర్తి వివరాలు పొందుపరిచిన టీజీపీఎస్సీ

Junior Lecturer Provisional List Release (ETV Bharat)
Published : Oct 28, 2024, 9:08 PM IST
|Updated : Oct 28, 2024, 10:37 PM IST