ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటవీ అధికారులపై గిరిజనుల దాడి - మహిళా ఆఫీసర్‌కు తీవ్రగాయాలు - TG TRIBALS ATTACK FOREST OFFICIALS

Tribals Attack Forest Department Officials in Nizamabad : అటవీ ప్రాంతంలో సాగు పనులు చేస్తున్నారని ట్రాక్టర్‌తో దుక్కి దున్నారనే సమాచారంతో నిజామాబాద్‌ సౌత్‌ రేంజ్‌ అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతం వద్దకు చేరుకున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులపై గిరిజనులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో మోపాల్‌ మండలం కాల్పోల్‌ అటవీ ప్రాంతంలో జరిగింది.

tribals_attack_forest_department_officials_in_nizamabad
tribals_attack_forest_department_officials_in_nizamabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 5:14 PM IST

Tribals Attack Forest Department Officials in Nizamabad :అటవీ ప్రాంతంలో సాగు పనులు చేస్తున్నారని ట్రాక్టర్‌తో దుక్కి దున్నారనే సమాచారంతో నిజామాబాద్‌ సౌత్‌ రేంజ్‌ అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతం వద్దకు చేరుకున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులపై గిరిజనులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో మోపాల్‌ మండలం కాల్పోల్‌ అటవీ ప్రాంతంలో జరిగింది.

సమాచారం అందిన వెంటనే అటవీశాఖ బీట్‌ అధికారులు బైరాపూర్‌ ప్రగతి, బద్రి, సెక్షన్‌ అధికారి సాయి కృష్ణలు కాల్పోల్‌ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సాగు చేస్తున్న గిరిజనులను అడ్డుకుని ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తరలించేందుకు యత్నించారు. దీంతో గిరిజనులు ఒక్కసారిగా వారిపై దాడికి పాల్పడ్డారు. ఒకరికి చేయి విరగగా, మహిళ అధికారిణికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details