తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ డ్రైవర్లపై రవాణా శాఖ ఫోకస్ - నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్​ రద్దే! - Penalties For Drunk and Drive Cases

Telangana Transport Department Focus on Rash Drivers : ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే సహించేది లేదని రవాణాశాఖ హెచ్చరిస్తుంది. ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై రవాణశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రమాదాలకు కారకులుగా భావించి ఏడాది కాలంలో 13,765 మంది వాహనదారుల లైసెన్స్​లను రవాణాశాఖ రద్దు చేసింది. ఇందులో అత్యధికంగా డ్రంక్ డ్రైవ్ కేసులే అని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Transport Department Cancels Driving License
Telangana Transport Department Focus on Rash Drivers

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 5:57 PM IST

Telangana Transport Department Focus on Rash Drivers :ఇకపై ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడిపితే సహించేదిలేదని కఠిన చర్యలు తప్పవని రవాణాశాఖ స్పష్టం చేస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువతే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలను(Road Accidents) అరికట్టేందుకు రవాణాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్న వారిని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి వారికి చలానాలు విధిస్తున్నారు. డ్రంక్ డ్రైవ్ చేస్తున్న వారికి జరిమానాలు వేస్తున్నారు.

Transport Department Cancels Driving License :ఈ విధంగా వ్యవహరిస్తున్న, వాహనదారుల లైసెన్స్​లను రద్దు చేయాలని రవాణాశాఖకు ట్రాఫిక్ పోలీసులు నివేదించారు. దీంతో స్పందించిన రవాణాశాఖ కొరడా ఝుళిపించింది. గత ఏడాదిలో ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడిపిన వాహనదారుల లైసెన్స్​లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ విధంగా రద్దు చేసిన లైసెన్స్​లను తిరిగి ఆరు నెలల వరకు పునరుద్దరించే అవకాశం ఉండదని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Penalties For Drunk and Drive Cases : లైసెన్స్​ల రద్దుకు సంబంధించి ఎక్కువ శాతం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఉన్నాయి. మొదటిసారి తాగి వాహనం నడిపి పట్టుబడితే రూ.10వేల జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి ఇదే నేరం చేస్తే రూ.15వేలు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇటువంటి వాహనదారులకు సంబంధించిన లైసెన్స్​లను ఆరు నెలల పాటు రద్దు చేస్తారు. విదేశాలకు వెళ్లే యువత ఎక్కువ శాతం అంతర్జాతీయ లైసెన్స్​లు(International Licenses) తీసుకుంటారు.

కారు రాష్ డ్రైవింగ్ - 'కారు మాత్రమే నీది రోడ్డు కాదు’ అంటూ నెటిజన్ ట్వీట్‌

డ్రంక్ అండ్ డ్రైవ్​లో దొరికి లైసెన్స్ సస్పెండ్ అయితే ఆరు నెలల వరకు తిరిగి లైసెన్స్పునరుద్దరణ చేసుకునేందకు వీలుండదు అని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అతివేగం, రేసింగ్​కు పాల్పడే వారికి మొదటి నేరమైతే రూ.5వేలు జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి దొరికితే రూ.10వేలు జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుంది. ట్రాఫిక్ పోలీసుల(Traffic Police) నుంచి రవాణాశాఖకు ప్రతిపాదనలు రాగానే రవాణాశాఖ ఆన్​లైన్​లో వాహనదారులకు షోకాజ్ నోటీసు ఇచ్చి తర్వాత వారి లైసెన్స్​లు సస్పెండ్ చేస్తామని రవాశాఖ అధికారులు తెలిపారు.

13,765 Licenses Canceled Across Telangana :రవాణాశాఖ గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈనెల 22వ తేదీ వరకు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వాహనదారులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 13,765 లైసెన్స్​లు రద్దు చేసినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో అత్యధికంగా డ్రంక్ డ్రైవ్ కేసులు 7,564 లైసెన్స్​లు, ప్రమాదాలకు కారణమైన వాహదారులవి 783 వరకు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున ప్రతి నెలకు సుమారు 1,147 లైసెన్స్​లను రవాణాశాఖ సస్పెండ్ చేసింది. రాష్ట్రంలో 70శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ నుంచి ఈనెల 22వ తేదీ వరకు 9,505 లైసెన్స్​లను రద్దు చేసినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణాశాఖ అధికారి రమేశ్​ తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 3,207 లైసెన్స్​లు, మేడ్చల్ మల్కాజ్​గిరి పరిధిలో 3,433 లైసెన్స్ లు, రంగారెడ్డిలో 2,865 లైసెన్స్​లు రద్దు చేసినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు.

సినిమా తరహాలో రెచ్చిపోయిన యువ జంట..!

రవాణా శాఖ, పోలీస్ శాఖతో డేటా షేరింగ్ అనుసంధానం ఉంది. వాళ్లు బుక్​ చేసిన చలానాలకు, కొన్ని కోర్టులు డైరెక్ట్​గా డ్రైవింగ్ లైసెన్స్​లను రద్దు చేస్తాయి. అటువంటి జాబితా సైతం మావద్దకు వస్తాయి. అలానే మిగలినవి చూసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్​కు సంబంధించి గతేడాది ఏప్రిల్ నుంచి ఈనెల 22వతేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,765 లైసెన్స్​లు సస్పెండ్ చేశాం. ఇవి ముఖ్యంగా సుప్రీం కోర్టు కమిటీ రోడ్డు సేఫ్టీ వాళ్ల మార్గనిర్దేశకాల ప్రకారం సస్పెండ్ ప్రక్రియను చేస్తున్నాం.-రమేశ్, హైదరాబాద్ సంయుక్త రవాణాశాఖ అధికారి

ఈ మూడు జిల్లాల పరిధిలో అధిక వేగంగా ప్రయాణించిన వాహనాలకు సంబంధించి 13 లైసెన్స్​లు, అధిక లోడ్ 84 లైసెన్స్​లు, రవాణా వాహనాల్లో మనుషుల ప్రయాణానికి సంబంధించి ఒక్కకేసు, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసే వాహనదారులవి 10 లైసెన్స్​లు, డ్రంక్ అండ్ డ్రైవ్​కు గానూ 5,757, ప్రమాదాలకు కారణమైన వాహనదారులవి 304 లైసెన్స్​లు, కోర్టు కేసులు 198, ఇతర కేసులు 3,138 లైసెన్స్​లు రద్దు చేసినట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.

నిబంధనల ప్రకారమే వాహనాలు నడపాలని రవాణశాఖ అధికారులు విజ్ఞప్తిచేస్తున్నారు. రాష్ డ్రైవింగ్(Speed Driving), డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం వల్ల నడిపే వారితో పాటు ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. రోడ్డుపై ప్రయాణించేప్పుడు కచ్చితంగా నిబంధలు పాటించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

రాష్ డ్రైవర్లపై రవాణా శాఖ ఫోకస్ - నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్​ రద్దే!

'హెల్మెట్​ పెట్టుకోలేదు.. రూ.1,000 ఫైన్​ కట్టు'.. కారు ఓనర్​కు పోలీసుల నోటీస్

'చలానా ఖరీదు... ఓ పసివాడి నిండు ప్రాణం'

ABOUT THE AUTHOR

...view details