Special Buses For Fish Prasadam Distribution 2024 : మృగశిర కార్తె వచ్చిందంటే హైదరాబాద్ వాసుల్లో మొదటగా మెదిలేది చేపమందు పంపిణీ. ప్రతి ఏడాది ఈ మాసంలో ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబం తరతరాలుగా చేప ప్రసాదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది మాదిరి ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీకి వారు రంగం సిద్ధం చేస్తున్నారు. మరో రెండ్రోజుల్లో జూన్ 8వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ చేపమందును అందించనున్నారు.
బత్తిని బ్రదర్స్ పంపిణీ చేసే ఈ చేప ప్రసాదం కోసం కేవలం హైదరాబాద్ నుంచే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి జనం వస్తుంటారు. అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా పేషెంట్స్ నగరానికి ఒక రోజు ముందుగానే చేరుకుంటారు. ఈ క్రమంలో చేప ప్రసాదం కోసం వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది.
Fish Prasadam Distribution 2024 :జూన్ 8, 9వ తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ చేయనున్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నవారు వస్తుంటారు. కొంతమందైతే రెండు రోజుల ముందే వచ్చి అక్కడ బస చేస్తుంటారు. మందు తమకు దొరుకుతుందా లేదోనని ముందే వచ్చేస్తుంటారు.
Chepa Mandu Distribution : అస్తమా పేషెంట్స్‌కు అలర్ట్.. మరో రెండ్రోజుల్లో చేప ప్రసాదం పంపిణీ