తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల వేళ పోలీసుల సోదాలు - ఇప్పటివరకు రూ.104 కోట్ల నగదు సీజ్​ - HUGE AMOUNT OF CASH SEIZED IN TS

Huge Amount Of Cash Seized in Telangana 2024 : రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అధికార యంత్రాగం నగదు అక్రమ రవాణా కట్టడిపై చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు చేసిన సోదాల్లో రూ.104 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Election Inspections in Telangana
Total Amount Seized in Telangana During Elections

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 10:49 AM IST

Updated : Apr 29, 2024, 12:04 PM IST

ఎన్నికల వేళ పోలీసుల సోదాలు ఇప్పటివరకు రూ104 కోట్ల నగదు సీజ్​

Huge Amount Of Money Seized in Telangana :తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసీ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారులు విస్తృత సోదాలు చేపడుతున్నారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చాక ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో రూ.104 కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అందులో రూ.63కోట్లకు పైగా నగదు, రూ.5.38 కోట్ల విలువ గల మద్యం, దాదాపు రూ.7కోట్ల 12 లక్షల విలువ గల మాదకద్రవ్యాలు, రూ.21.34 లక్షలకు పైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 7,174 లైసెన్స్‌ కలిగిన ఆయుధాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎలక్షన్​ కోడ్ అమల్లో ఉన్న కారణంగా అధిక మొత్తంలో డబ్బుతో ప్రయాణించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేని పక్షంలో వాటిని సీజ్​ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వడ్డీ వ్యాపారస్థులపై పోలీసుల పంజా - పలు కీలక పత్రాలు స్వాధీనం - POLICE INSPECTS MONEYLENDERS

Rs.1 Lakh Money Seized in Suryapet :ఇదిలా ఉండగా సూర్యాపేట నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న ఓ కారును ఆదివారం రోజున వర్ధన్నపేట శివారులోని పోలీస్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న లక్ష రూపాయల నగదు మొత్తాన్ని సీజ్ చేసిన పోలీసులు, ఎలక్షన్ కమిషన్ అధికారులకు అందజేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా రూ.50వేల రూపాయల కంటే ఎక్కువ నగదుతో ఎవరు ప్రయాణించవద్దని తెలిపిన పోలీసులు నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Rs.20 Lakhs Seized in Khammam :ఖమ్మం జిల్లా మండలం కేంద్రంలో ఈరోజు ఉద యం వెంకటగిరి క్రాస్ రోడ్డు చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా రూ.20 లక్షల నగదు, 25 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్య పేటకి చెందిన పవన్​ అనే బంగారం వ్యాపారి కారులో హైదరాబాద్​కు వెళ్తూ ప్రత్యేకంగా తయారు చేసిన బనియన్​లో డబ్బు, నగదు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

లోక్​సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు - హైదరాబాద్​లో రూ.1.50 కోట్ల సొత్తు సీజ్ - Lok Sabha Elections 2024

ఏసీబీ వలలో జమ్మికుంట తహశీల్దార్​ రజిని - అక్రమాస్తులు రూ.12 కోట్లకు పైమాటే!

Last Updated : Apr 29, 2024, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details