Telangana Incharge Governor 2024 : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పుదుచ్చేరి ఎల్జీగా కూడా రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలను కట్టబెట్టారు.
మరోవైపు తెలంగాణ గవర్నర్‌తో పాటు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించటం పట్ల ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనపై నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) , హోం మంత్రి అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
'జగనే ఎందుకు కావాలంటే' నిర్వహణతో ప్రజాధనం దుర్వినియోగం - గవర్నర్, సీఈసీకి ఫిర్యాదు
లోక్‌సభ బరిలో తమిళిసై : తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి లోక్‌సభకు పోటీ చేసిన కరుణానిధి కుమార్తె కణిమొళిపై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమెను 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా (Governor) భారత రాష్ట్రపతి నియమించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండో గవర్నర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2021 ఫిబ్రవరి 18వ తేదీ నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.