Telangana New State Logo : తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం నిలవనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణను స్వల్ప మార్పులతో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి స్వరపరుస్తున్న విషయం తెలిసిందే. ఇక అధికారిక చిహ్నంలోనూ పలుమార్పులు చేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో రాచరికపు గుర్తులు తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
రాజధాని నుంచి సామగ్రి తరలింపు - ప్రభుత్వం తీరుపై అమరావతి రైతుల తీవ్ర ఆగ్రహం
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధికారిక చిహ్నం తుది రూపుపై తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రోజున సమీక్ష నిర్వహించి చిహ్నంలో మార్పులు చేర్పులపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రజలు, ప్రజా జీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిహ్నాన్ని కూడా జూన్ 2వ తేదీన ఆవిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana New Emblem Photo Viral :ఈ నేపథ్యంలోనే పలు గుర్తులను తొలగించి కొత్త లోగో తయారు చేసినట్లు సమాచారం. కళాకారుడు రుద్రరాజేశం ఇప్పటికే పలు డిజైన్లు రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి చూపించగా అందులో ఓ డిజైన్‌ను ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర చిహ్నానికి సంబంధించి ఇప్పుడు ఒక లోగో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అధికారిక రాజముద్ర అంటూ నెట్టింట అనధికార ప్రచారం జరుగుతోంది.