ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుబంధాలు, వివాహ బంధాలపై స్టడీస్ - మహిళా యూనివర్సిటీలో కొత్త కోర్సు - Family and Marriage Counseling - FAMILY AND MARRIAGE COUNSELING

Family and Marriage Counselling Course : ఈ మధ్యకాలంలో ఉద్యోగాల కారణంగా తమ వ్యక్తిగత జీవితాన్ని చాలామంది ఆస్వాదించలేకపోతున్నారు. ఇవి కుటుంబ బంధాలపై మరింత ప్రభావం చూపుతున్నాయి. దీంతో కౌన్సిలింగ్ బాట పడుతున్నారు. అలా ఫ్యామిలీ, మ్యారేజీ కౌన్సిలింగ్​ కోర్సులకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ కోర్సును ప్రస్తుతం తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో బోధిస్తున్నారు.

More Demand For Family and Marriage Counselling Course
More Demand For Family and Marriage Counselling Course (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2024, 9:44 AM IST

More Demand For Family and Marriage Counselling Course :ఈ మధ్య కాలంలో కుటుంబ బంధాలు గాడి తప్పుతున్నాయి. అందుకే కుటుంబాల్లో రిలేషన్స్​కు సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా కౌన్సిలింగ్​కు వెళ్తున్నారు. అత్తాకోడళ్లు, భార్యభర్తలు తమ బంధాల్లో సమస్యలు తలెత్తితే నిపుణుల దగ్గరకు వెళ్లి పరిష్కరించుకుంటున్నారు. వారిలో ఏదైనా లోపం ఉంటే కౌన్సిలింగ్​ ద్వారా సరిదిద్దుకుంటున్నారు.

ఇలా కుటుంబాల్లో అనుబంధాలు, వివాహ బంధాల గొప్పదనాలను వివరించే కోర్సును తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అందరికీ అందుబాటులోకి తెచ్చింది. 'ఫ్యామిలీ, మ్యారేజ్‌ కౌన్సెలింగ్‌' పేరుతో నాలుగేళ్ల క్రితం యువతుల కోసం దీన్ని మొదలు పెట్టింది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు భార్యాభర్తలు, అత్తాకోడళ్ల మధ్య అపోహలు, విభేదాలు, అహాలను పోగొట్టి అనుబంధాల విలువలను వివరించే వ్యక్తిత్వ వికాస నిపుణులుగా మారుతున్నారు.

Marriage Fear Counseling : 'పెళ్లంటే నూరేళ్ల మంట' అని భయపడుతున్నారా? ఈ నిపుణుల సలహాలు మీకోసమే!

ఆన్​లైన్లో కూడా కోర్సు అందుబాటులోకి : ఏడాది వ్యవధి గల ఈ పీజీ డిప్లొమా కోర్సును చదివేందుకు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. కనిష్ఠంగా 30 మంది గరిష్ఠంగా 100 మందికి ప్రవేశాన్ని వర్సిటీ కల్పిస్తుంది. తొలుత యువతులను మాత్రమే అనుమతించగా ఇప్పుడు అందరికీ ప్రవేశాల అవకాశం కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసెస్​లోనూ ఇది అందుబాటులో ఉంది. కోర్సును పూర్తి చేసిన తొంభైమందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభించాయి.

పోలీస్​ స్టేషన్లు, షీ బృందాలు మానసిక నిపుణులు వద్ద కౌన్సెలర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అలా కౌన్సిలింగ్​ నిర్వహించే వారికి ఫ్యామిలీ, మ్యారేజీ కౌన్సెలింగ్​ పీజీ డిప్లోమా కోర్సు తప్పనిసరి. అందుకే ఇది చదివే వారికి భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు మానసిక సమస్యలను తెలుసుకోవడం, ఇతరుల ప్రభావం వారిపై ఎంత వరకు పడుతుందని గుర్తించడం వంటి విషయాలతో పాటు చట్టాల గురించి తెలియజేస్తున్నారు. అత్తాకోడళ్ల మధ్య వివాదాలు, భార్యా భర్త, కుటుంబంలోని సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు, వాటి కారణంగా వచ్చే సమస్యలు పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

మీ దాంపత్యం​ రొమాంటిక్​గా ఉండాలంటే - ఇలా చేయండి!

విద్యార్థినులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ :వాటి ప్రభావం బంధాలపై ఎలా పడుతుందో వివరిస్తున్నారు. ప్రత్యక్షంగా పరిశీలించి అవగాహన పెంచుకునేందుకు మూడు నెలల ప్రాక్టికల్​ ట్రైనింగ్ ఇస్తున్నారు. మహిళా ఠాణాల్లో, భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ డెస్క్​లకు విద్యార్థినులను పంపిస్తున్నారు. ఈ కోర్సుకు ఆదరణ పెరగడంతో ఆన్​లైన్​ పద్ధతిలోనూ నిర్వహిస్తున్నామని. ప్రాక్టికల్స్​ విశ్వవిద్యాలయంలో చెబుతున్నామని కోర్సు సమన్వయకర్తలు డా. రవి కుమార్, ప్రొఫెసర్ వినీతా రాయ్​లో చెప్పారు. రిజర్వుబ్యాంక్​ ఆఫ్ ఇండియా, బ్యాంకులు, పోలీస్​ శాఖ విశ్రాంత అధికారులు ఈ కోర్సును నేర్చుకుంటున్నారని, కొందరు లాయర్లు కూడా చేరారని వారు తెలిపారు.

మీ భాగస్వామితో బంధం నూరేళ్లు నిలవాలంటే.. ఇలా చేయండి

ABOUT THE AUTHOR

...view details