తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్ రిజల్ట్స్​ ఆ రోజే - ఇలా చెక్​ చేసుకోండి! - Telangana Inter Results 2024 - TELANGANA INTER RESULTS 2024

Telangana Inter Results 2024: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షా ఫలితాల విడుదల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌. ఫలితాల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్​ అయ్యింది. మరి.. రిజల్ట్స్ ఏ రోజున వస్తున్నాయో ఈ స్టోరీలో చూద్దాం..

Telangana Inter Results 2024
Telangana Inter Results 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 2:28 PM IST

Telangana Intermediate Results 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్​ పరీక్షా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం గుడ్​న్యూస్​. వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తోంది.

Telangana Intermediate Results: తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేసి ఎంతో పకడ్బందీగా పరీక్షలను అధికారులు నిర్వహించారు.

మార్చి 10వ తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించిన అధికారులు.. ఏప్రిల్ 10వ తేదీన మూల్యాంకనం పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి టెక్నికల్‌ ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటం వల్ల ఎలక్షన్‌ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న అధికారులు ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు.

రిజల్ట్స్ వచ్చేశాయ్ - పదో తరగతి ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి - AP SSC Results Released 2024

రెండూ ఒకేసారి:ఇంటర్​ ఫస్ట్‌ ఇయర్‌, సెంకండ్‌ ఇయర్‌ రిజల్ట్స్​ను ఒకేసారి ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అన్ని ముందస్తు కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ఈ నెల 24వ తేదీ బుధవారం రోజున పరీక్షా ఫలితాలు రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. గత సంవత్సరం మే 9వ తేదీన ఫలితాలను ప్రకటించారు. ఈసారి అంతకంటే 15 రోజుల ముందే ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు.

ఇలా చెక్​ చేసుకోండి: ఇంటర్ రిజల్ట్‌ అఫిషియల్‌గా ప్రకటించగానే వాటిని అధికారిక వెబ్​సైట్ లోకి వెళ్లి తెలుసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ ఫస్ట్‌, సెంకడ్‌ ఇయర్‌ రిజల్ట్‌ కోసం అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in లోకి వెళ్లి రిజల్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు.

  • ముందుగా తెలంగాణ స్టేట్​ బోర్డ్​ ఆఫ్ ఇంటర్మీడియట్​ ఎడ్యుకేషన్​ అధికారిక వెబ్​సైట్​ ఓపెన్​ చేయాలి. https://tsbie.cgg.gov.in
  • తర్వాత స్క్రీన్​​ మీద కనిపించే Results ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • స్క్రీన్​పై కొత్త పేజీ ఓపెన్​ అవుతుంది.
  • అందులో Result Year, Year Type, Category, Examination Type, Hall Ticket Number ఎంటర్​ చేసి Get Memo బటన్​పై క్లిక్​ చేస్తే మీ రిజల్ట్​ కనిపిస్తాయి. ఆ మెమోను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

అయ్యో పాపం - గమనించకుండా నీటి సంపులో పడి యువకుడి మృతి - వీడియో వైరల్ - YOUNG MAN FELL IN WATER SUMP IN HYD

ABOUT THE AUTHOR

...view details