Telangana Horticulture University Trying to GI Tag for Custard Apple : తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో పండే సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు(GI) కోసం దరఖాస్తు చేయాలని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. దీని కోసం ఇప్పటికే అధ్యయనాలు చేపట్టి గణాంకాలు సేకరిస్తుంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు కోసం జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రూ.12.70 లక్షల సాయం అందించేందుకు ముందుకొచ్చింది. మొదట బాలానగర్ అడవుల్లో పుట్టిన ఈ సీతాఫలం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు క్రమంగా విస్తరించింది.
"సీతాఫల్ సేమియా పాయసం" - రుచి అమృతాన్ని మించి - ఒక్కసారి టేస్ట్ చేస్తే జిందగీ ఖుష్!
రుచి, నాణ్యతకు ప్రసిద్ధి : ఆగస్టు చివరి నుంచి నవంబరు చివరి వరకు ఆ ప్రాంతాల్లోని ప్రజలకు, ముఖ్యంగా గిరిజనులకు ఉపాధి కల్పిస్తుంది. రుచి, నాణ్యతకు ఎంతో పేరొందిన ఈ బాలానగర్ సీతాఫలాలు తెలంగాణ రాష్ట్రంతోపాటు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే, విస్తృత ప్రాచుర్యం పొందిన ఈ సీతాఫలాలకు పోటీగా హైబ్రిడ్ పండ్లు మార్కెట్లోకి విపరీతంగా వస్తున్నాయి. దీంతో బాలానగర్ ఫలాల విశిష్టతను కాపాడుకునేందుకు జీఐకి దరఖాస్తు చేయాలని ఉద్యాన విశ్వవిద్యాలయం సంకల్పించింది. అందుకు అవసరమైన కసరత్తు సైతం చేపట్టింది. రుచి, నాణ్యతకు పేరొందిన ఈ బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు వస్తే ఈ రకానికి చట్టబద్ధ రక్షణ చేకురుతుందని తెలంగాణ ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు.
షుగర్ పేషెంట్స్ సీతాఫలం తినొచ్చా?-నిపుణుల మాటేంటి!
సీతాఫలం తింటే జలుబు చేస్తుందా? - ఆయుర్వేదం ఏం చెబుతుంది!