HC ON PETITION ABOUT PUSHPA 2: 'పుష్ప 2' మూవీకి అన్ని అడ్డంకులూ తొలిగిపోయాయి. మరికొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తాజాగా పుష్ప-2 నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. పుష్ప-2ను నిలిపివేయాలంటూ శ్రీశైలం అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప-2 తీశారని పిటిషనర్ తెలిపారు. సెన్సార్ బోర్డు తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు.
చిత్రం చూశాకే విడుదలకు అనుమతించారని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకి తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు, ఊహాజనితంగా తీసిన చిత్రం విడుదలను నిలుపుదల చేయలేమంటూ తీర్పు ఇచ్చింది. అదే విధంగా కోర్టు సమయం వృథా చేసినందుకు పిటిషనర్‌కి జరిమానా విధిస్తన్నట్లు తెలిపింది. జరిమానా మెుత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
పుష్ప 2 టికెట్ ధరలు పెంపు - ప్రభుత్వానికి అల్లు అర్జున్ ధన్యవాదాలు
రిలీజ్‌కి ముందే రికార్డులు: కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా నటిస్తున్న 'పుష్ప 2' మూవీ పాన్ఇండియా లెవెల్లో రిలీజ్‌కి సిద్ధమయ్యింది. డిసెంబర్ 5వ తేదీ (గురువారం) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. అంతకుమందే డిసెంబర్ 4వ తేదీ బుధవారం అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకుపైగా థియేటర్లలో, 80 దేశాల్లో, 6 భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి. బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా వన్ మిలియన్ టికెట్స్ అమ్ముడైన మూవీగా 'పుష్ప 2' రికార్డు సృష్టించింది.
'పుష్ప 2' మూవీని డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. రష్మిక మందన్నా ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటిస్తుండగా, మాలీవుడ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్‌గా పాత్రలో అలరించనున్నారు. అదే విధంగా సీనియర్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్‌లు స్పెషల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించారు.
'పుష్ప 3' కన్ఫామ్ - మూవీలో విజయ్ దేవరకొండ కూడా! - టైటిల్ ఏంటంటే?