Telangana High Court Dismissed IAS Officers Petition:డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్‌లకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలన్ని న్యాయస్థానం ఆదేశించింది. ట్రైబ్యునల్‌లో నవంబరు 4న విచారణ ఉందని అప్పటి వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్‌లు కోరారు.
రిలీవ్ చేసేందుకు 15 రోజులు గడువు ఇవ్వాలని డీవోపీటీని కోరినట్లు ఐఏఎస్‌లు వివరించారు. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యతాయుతమైన అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దని కోరింది. మరోసారి పరిశీలించాలని డీవోపీటీని ఆదేశించమంటారా అని ఐఏఎస్‌లను హైకోర్టు అడిగింది. సమాఖ్య దేశంలో రాష్ట్రాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది.
వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు-సేవ చేయాలని లేదా? - ఐఏఎస్‌లను ప్రశ్నించిన క్యాట్
ఈనెల 9న ఆ ఐఏఎస్‌లకు డీవోపీటీ ఉత్తర్వులు : ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్, శివశంకర్ తెలంగాణకు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు డీవోపీటీ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది.