తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్‌ -1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల - రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి - TGPSC Group1 Prelims Results 2024

Telangana Group-1 Prelims Results 2024 : తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత తుది కీతో పాటు ఫలితాలు వెల్లడించింది.

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 11:47 AM IST

Updated : Jul 7, 2024, 2:24 PM IST

Telangana Group-1 Prelims Results
Telangana Group-1 Prelims Results (ETV Bharat)

Telangana Group-1 Prelims Results 2024 : తెలంగాణ గ్రూప్-1 పరీక్ష రాసిన విద్యార్థులకు అలర్ట్. గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం రోజున ప్రకటించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత కమిషన్ తుది కీ విడుదల చేసింది. అనంతరం ఫలితాలు వెల్లడించింది. ఫలితాలు టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో చెక్ చేసుకోవచ్చని కమిషన్ అధికారులు తెలిపారు. గ్రూప్​-1 మెయిన్స్​కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు వెల్లడించారు.

జూన్​ 13న ప్రిలిమినరీ కీతో పాటు ప్రధాన ప్రశ్న పత్రాన్ని అభ్యర్థుల లాగిన్​లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించిన తరవాత నిపుణుల అభిప్రాయాలు తీసుకుని నేడు తుది కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్​సైట్​లో చూసుకోవచ్చని తెలిపింది. అక్టోబర్​ 21 నుంచి 27 వరకు గ్రూప్​ 1 మెయిన్స్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచే అభ్యర్థులు హాల్​ టికెట్​లు డౌన్​లోడ్​ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

నిష్పత్తిని తగ్గించాలని నిరసనలు :మరోవైపు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్​-1 పరీక్ష మెయిన్స్​కు అభ్యర్థుల ఎంపిక 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో చేయాలని రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు, కొందరు అభ్యర్థులు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే టీజీపీఎస్సీ మాత్రం గ్రూప్​-1 మెయిన్స్​కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జోవో 29,55 నిబంధనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ప్రకటన కూడా చేసింది.

నిష్పత్తి తగ్గించడం సాధ్యం కాదు : టీజీపీఎస్సీ అయితే టీజీపీఎస్సీ ప్రకటనపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 1:100 నిష్పత్తిలోని ఎంపిక చేసి ప్రతిభ గల అభ్యర్థులకు న్యాయం చేయాలని పిటిషన్​ వేశారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం ఈ సమస్యను చట్టానికి లోబడి త్వరితగతిన కమిషన్​ చర్యలు తీసుకోవాలని సూచించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను పరిశీలించిన టీజీపీఎస్సీ 1:100 పద్ధతి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఏ విధానం 1:50 ఉందో దాన్నే కొనసాగిస్తున్నామని చెప్పి నేడు ప్రధాన కీతో పాటు ప్రిలిమినరీ పూర్తి ఫలితాలను విడుదల చేసింది.

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక - TGPSC GROUP 1 CANDIDATES SELECTION

గ్రూప్- 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల - TGPSC Group1 Prelims Key Released

Last Updated : Jul 7, 2024, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details