Telangana Govt strengthens Hydra with More Powers : నీటి వనరుల్లో ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపునకు ఏర్పాటు చేసిన హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించనుంది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం - 1905కు సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకురానుంది.
అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్టినెన్స్ :ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణ చట్టంలోని 1ఏ, 7ఏ సెక్షన్లను సవరించి, అసెంబ్లీ సమావేశాలు లేనందున చట్టం తేవడం ప్రస్తుతానికి వీలు కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905 (ఎమెండ్‌మెంట్) ఆర్డినెన్స్-2024 తీసుకురానుంది. రెవెన్యూ, నీటి పారుదల, పురపాలక, జీహెచ్‌ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ తదితర శాఖలకు ఉన్న అధికారాలను చట్టం ద్వారా, కొన్ని ప్రత్యేక జీవోల ద్వారా ఉన్న అధికారాలను తాజాగా తెచ్చే ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అప్పగించనుంది.
'పేదవాళ్లు డబ్బులు ఇవ్వలేకపోయినా - వైద్యం చేయడమే మా సూత్రం' : అదే LVP సక్సెస్ మంత్ర - DR Nageswara Rao Interview
హైదరాబాద్ చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆటస్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినపుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడం, ఫైర్ సర్వీసుకు సంబంధించి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ తదితర అధికారాలతో జులై 19న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని జీహెచ్‌ఎంసీ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఓఆర్‌ఆర్ వరకు బాధ్యతలతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ను గవర్నమెంట్ ఏర్పాటు చేసింది.
'ఆ ప్లెక్సీలు తొలగించాల్సిన బాధ్యత అధికారులదే' - HC on Unauthorised Hoardings
పలు శాఖల అధికారులు హైడ్రాకు బదిలీ : ఆస్తుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించినవి హైడ్రా పరిధిలో ఉన్నాయి. హైడ్రాకు ఈ అధికారాలు అప్పగించకపోతే ఆ సంస్థ లక్ష్యం మేరకు పనిచేయడం వీలుపడదు. దీంతో అనివార్యంగా వివిధ శాఖలకు చట్టపరంగా దఖలు పడిన కొన్ని అధికారాలను తొలగించి హైడ్రాకు బదిలీ చేసేలా చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసెంబ్లీ సమావేశాలు లేనందున ప్రస్తుతానికి ఆర్డినెన్స్ తీసుకురానుంది ఆసెంబ్లీ సమావేశాలు లేనందున ప్రస్తుతానికి ఆర్డినెన్స్ తీసుకురానుంది.
హైడ్రాకు విశేషాధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905కు చేయనున్న చట్ట సవరణలో ఇప్పటికే వివిధ శాఖలకు ఉన్న అధికారాలు హైడ్రాకు వెళ్లనున్నాయి. వాటి ప్రకారం
జీహెచ్‌ఎంసీ చట్టం-1955 ప్రకారం ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని అనధీకృత కట్టడాలను తొలగించడం, అనధికార ప్రకటనలకు జరిమానాలు విధించడం ఇవన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఉన్న అధికారాలు. ఇవే అంశాలపై తెలంగాణ పురపాలక చట్టం-2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్‌కు ఉన్న అధికారాలు
- బీపాస్ చట్టం-2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్‌ఫోర్స్, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు ఉన్న అధికారాలు.
- హెచ్‌ఎండీఏ చట్టం-2008లో 8, 23ఏ సెక్షన్ల కింద హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు ఉన్న అధికారాలు హైడ్రాకు ట్రాన్సఫర్ చేయనున్నారు.
- తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని 1317ఎఫ్ ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల సంరక్షణకు సంబంధించి ఆర్డీవో అధికారులు జిల్లా కలెక్టర్‌కు ఉన్నాయి.
- తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357ఎఫ్ ప్రకారం నీటిపారుదల శాఖ అధికారి/జిల్లా కలెక్టర్‌కు ఉన్న అధికారాలు .
- జీవోఎంఎస్-67 ద్వారా 2002లో యు.డి.ఎ/ఎగ్జిక్యూటివ్ అధికారికి ఉన్న అధికారాలు.
- తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905లో సెక్షన్లు 3, 6, 7, 7ఏ కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్‌కు ఉన్న అధికారాలు హైడ్రాకు బదిలీ కానున్నాయి.
వాల్టా చట్టం-2002, జీవోఎంఎస్-168 ప్రకారం తెలంగాణ బిల్డింగ్స్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్-1999లో ఇందుకు సంబంధించిన అధికారాలు తొలగించి హైడ్రాకు దక్కేలా నిర్ణయించారు. పలు అధికారాలు హైడ్రాకు బదిలీ ప్రతిపాదన న్యాయవిభాగం పరిశీలనలకు వెళ్లగా తెలంగాణ పురపాలక చట్టం-2019, బీపాస్ చట్టం-2020, హెచ్‌ఎండీఏ చట్టం-2008, వాల్టా చట్టం-2002లోని అధికారాలను హైడ్రా కమిషనర్‌కు అప్పగించడంతోపాటు హైడ్రా గవర్నింగ్ బాడీలో సీసీఎల్‌ఏ ఉండాలని, మిగిలిన చట్టాల్లో కొన్ని నిబంధనల్లో మార్పులు చేయాలని న్యాయవిభాగం సూచించింది. చట్టాల్లో అవసరమైన మార్పులు చేస్తే కానీ హైడ్రాకు అధికారాలు బదలాయించడం వీలుకాదని తెలిపింది. దీనిపై రెవెన్యూ, పురపాలకశాఖల మధ్య చర్చలు జరిగిన తర్వాత తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905కు సవరణ చేయాలని సర్కార్ నిర్ణయించింది. మంత్రివర్గం ఆమోదం తీసుకొని ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు సమాచారం.
ఐఎంజీ భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు విచారణ - విజయసాయిరెడ్డి పిటిషన్ కొట్టివేత - TG High Court on IMG Land Case