Another 1500 Teachers Promotions Soon : ఇటీవల రాష్ట్రంలో 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రమోషన్లు పొందిన తర్వాత కూడా కొన్ని ఖాళీలు మిగిలిపోయి ఉన్నాయి. వాటికి కూడా త్వరగా పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు జిల్లాల వారీగా సబ్జెట్ల వారీగా ఖాళీలు, సీనియారిటీ జాబితాను రూపొందించి రెండు రోజుల్లో పంపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం అధికారులు డీఈవోలకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 వరకు ఖాళీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వీరందరికీ పదోన్నతులు లభిస్తాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
హైకోర్టులో పదోన్నతుల కేసు : రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతుల విషయంలో కొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విద్యాశాఖ అధికారులు పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన వాటిని కూడా భర్తీ చేస్తామని ఇటీవల హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే అందుకు విద్యాశాఖ కూడా కసరత్తు చేస్తోంది.
ఆప్షన్లలో ఖాళీలు ఏర్పడిందిలా : కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో సుమారు 19,000 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే. కొంతమంది ఉపాధ్యాయులు రెండు, మూడు పోస్టుల్లో పదోన్నతులు పొందేందుకు అర్హత ఉండటంతో వారంతా వాటన్నింటికీ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఉదాహరణకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) బీఏ, బీఈడీ చదివి ఉన్నారు. ఆయన బీఈడీలో తప్పనిసరిగా రెండు మెథడాలజీలు చదివి ఉన్నందున స్కూల్ అసిస్టెంట్ రెండు సబ్జెక్టులకు అర్హత సాధిస్తారు.