KEY Update On New Ration Cards In Telangana :తెలంగాణ రాష్ట్రంలో మరో 30 లక్షల మందికి రేషన్ లబ్ధి కలిగే అవకాశముంది. వారికి సీఎం రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతకం చేసిన లేఖతో కొత్త రేషన్‌కార్డులను జారీ చేయనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ ముందుగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ :రేషన్‌కార్డులు లేనివారికి నూతన కార్డులు జారీ చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో ఫ్యామిలీ మెంబర్ల పేర్లను చేర్చాలని అభ్యర్థిస్తూ వచ్చిన అప్లికేషన్లను ఆమోదించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతంలో ఉన్న పాత రేషన్‌కార్డులకు సంబంధించిన వివరాలను సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
కొత్త కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ ఉండదు :కొత్త రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ ఉండదని పౌరసరఫరాల శాఖ కీలకవర్గాలు వివరించాయి. కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ‘సామాజిక, ఆర్థిక సర్వేలో రాష్ట్రంలోని పేదల వివరాలున్నాయి. అర్హులైన పేదల్లో రేషన్‌కార్డులు ఉన్నవారి, లేనివారికి సంబంధించిన సమాచారం ఉంది. ప్రతిపాదిత అర్హుల వివరాల జాబితాను గ్రామసభలు, బస్తీ సభల్లో ప్రదర్శించనున్నారు. అక్కడే కొత్త రేషన్ కార్డులకు అర్హులైన వారి పేర్లు ఖరారవుతాయి. ఇదిలా ఉండగా కొత్త రేషన్‌కార్డుకు సంబంధించిన డిజైన్ ఇంకా ఖరారు కాలేదు. ఆ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశముందని పౌరసరఫరాల శాఖ వర్గాలు వివరించాయి.