తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్​నగర్​లో అసంపూర్తి పనుల కోసం రూ.74 కోట్ల మంజూరు - మంత్రి ఉత్తమ్ చిత్రపటానికి పాలాభిషేకం - ఉత్తమ్​కుమార్​ ఫోటోకు పాలాభిషేకం

Telangana Government Release Funds for House : ఎన్నికల సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ​రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు సూర్యాపేట జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 2,160 ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం రూ.74.80 కోట్లు మంజూరు చేసింది. దీంతో మంత్రి ఉత్తమ్​కుమార్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Huzurnagar Model Colony Issue
Telangana Government Release Funds for House

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 2:14 PM IST

Telangana Government Release Funds for House: పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రారంభించిన మోడల్‌ కాలనీకి మోక్షం కలగనుంది. అసంపూర్తి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.74.80 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హుజూర్‌నగర్‌లో 2 వేలకు పైగా గృహాలు ఒకేసారి నిర్మాణం పూర్తి కానున్నాయి. ఇదిలా ఉండగా, హామీ ఇచ్చిన నెల రోజుల్లోనే మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణం ఫణిగిరిగట్టు వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్‌ కాలనీ ఇళ్లకు మోక్షం కలిగింది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం 2,160 ఇళ్ల నిర్మాణ పనుల కోసం రూ.74.80 కోట్లు మంజూరు చేస్తూ జీవో నంబర్ 44ను విడుదల చేసింది.

మంత్రి ఉత్తమ్‌తో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేల భేటీ- ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై విజ్ఞప్తి

Huzurnagar Model Colony Issue : గతేడాది డిసెంబరు 23న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కలిసి హుజూర్‌నగర్‌లో ఉన్న మోడల్‌ కాలనీ ఇళ్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో నెల రోజుల్లోనే నిధులు మంజూరు చేస్తామని ఉత్తమ్‌కు పొంగులేటి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ(TS GOVT Funds Released Housing) చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మోడల్‌ కాలనీ నిర్మాణంపై హామీ ఇచ్చారు. అదేవిధంగా తాను పదేళ్ల కిందట మంత్రిగా ప్రారంభించిన కాలనీ నిర్మాణం తిరిగి మంత్రి హోదాలో మరోసారి నిధులు మంజూరు చేయించి పనుల పూర్తికి సిద్ధమవుతున్నామని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేలా అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది.

రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ ఈవెంట్​గా మార్చారు : ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి

Palabhishekam to Minister Uttam Kumar in Suryapet: నిధులు మంజూరు చేసినందుకు మంత్రి ఉత్తమ్(Minister Uttam Kumar Reddy) చిత్రపటానికి కాంగ్రెస్​ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. పది సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న పేద ప్రజల కల సాకారం కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రూ.45 కోట్లు మంజూరు చేసినా, నిధులు విడుదల చేయలేదని గుర్తు చేశారు. పది సంవత్సరాల క్రితం 80 శాతం పూర్తి అయిన ఇళ్లు, గత ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌లో సాగు నీటి కేటాయింపులు : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details