Telangana DGP responds to Allu Arjun and Mohan Babu incidents:పోలీసులు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, పౌరుల భద్రత తమకు ముఖ్యమని తెలంగాణ డీజీపీ డా.జితేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనపై డీజీపీ స్పందించారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, అల్లు అర్జున్ సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలో శాంతిభద్రతలు ఫరిఢవిల్లాలంటే పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
సినిమా ప్రమోషన్ల కంటే పౌరుల భద్రత, రక్షణే తమకు ముఖ్యమని డీజీపీ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరగటం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్త్రీ, పిల్లల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అందువల్లే ప్రతి జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 ఎస్పీ కార్యాలయాలు, మరో 9 కమిషనరేట్లు ఉన్నాయని, ఇప్పటి వరకు 27 భరోసా కేంద్రాలను ప్రారంభించినట్లు డీజీపీ చెప్పారు. కరీంనగర్లో భరోసా కేంద్రాన్ని నిర్మించేందుకు ఎస్బీఐ సీఎస్ఆర్ నిధులను వెచ్చించామన్నారు. దాదాపు 6,800 చదరపు అడుగుల భవనాన్ని నిర్మించిందని వివరించారు.
చంద్రబాబు సెక్యూరిటీ డ్యూటీలోకి అటానమస్ డ్రోన్- సీఎం భద్రత భారీగా కుదింపు