తెలంగాణ

telangana

ETV Bharat / state

అడుగు దూరంలో 'భూ భారతి బిల్లు' - ఇక గవర్నర్​ ఆమోదమే తరువాయి - BHU BHARATI BILL

ఆర్వోఆర్​ -2024 బిల్లుకు ఉభయ సభలు ఆమోదం - గవర్నర్​ ఆమోదం తెలిపితే బిల్లుకు చట్టరూపం - సభ్యుల సూచనలను చట్టంలో చేర్చుతామన్న రెవెన్యూ మంత్రి

Bhu Bharati Bill
Bhu Bharati Bill (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 11 hours ago

Bhu Bharati Bill : సాగు భూముల రిజిస్ట్రేషన్లు - మ్యుటేషన్ల పోర్టల్​ ధరణి స్థానంలో ఇక నుంచి భూభారతి రానుంది. ఇందుకు సంబంధించిన ఆర్వోఆర్​-2024 బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లుకు శుక్రవారమే శాసనసభ ఆమోదం తెలపగా, శనివారం శాసనమండలిలో చర్చించిన అనంతరం ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి ఆమోదముద్ర వేశారు. దీంతో అది గవర్నర్​ ఆమోదం కోసం వెళ్లనుంది. ఆయన ఆమోదముద్ర వేయగానే చట్టం అమల్లోకి వస్తుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

శాసనసభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కాంగ్రెస్​ ప్రభుత్వం ధరణిని రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. దాని స్థానంలో కొత్త పోర్టల్​ను తీసుకొస్తామని చెప్పి భూభారతి పోర్టల్​ ఏర్పాటు ప్రక్రియలను పూర్తి చేసింది. ఈ ఏడాది జనవరి 9న ఐదుగురు సభ్యులతో కూడిన ధరణి కమిటీ పలు క్షేత్రస్థాయి అధ్యయనాలు చేసింది. అలాగే వివిధ శాఖలతో సమీక్షల అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అనంతరం ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం 18 రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ఆర్వోఆర్​ చట్టాలను అధ్యయనం చేసింది. ఈ క్రమంలో ఆర్వోఆర్​ -2020 చట్టాన్ని రూపొందించిన నిపుణులతో వారు సమావేశం అయ్యారు

ఈ క్రమంలో నిపుణుల కమిటీ రాష్ట్రంలోని రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు చరమగీతం పాడేందుకు అవసరమైన అన్ని రకాల సెక్షన్లను చట్టంలో చేర్చేందుకు ప్రణాళిక రచించి నిర్ణయించింది. ఆగస్టులో డ్రాప్ట్​ను సిద్ధం చేసి వివిధ వర్గాల సలహాలు, అభిప్రాయాలు స్వీకరించారు. ఈ చట్టంపై దాదాపు 11 నెలల పాటు నిపుణులు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు. చివరికి 21 సెక్షన్లతో డ్రాప్ట్​ను సిద్ధం చేయగా.. వాటిలో 19 సెక్షన్లు వివిధ క్లాజులకు సంబంధించినవే.

కొత్త అంశాలకూ ఈ చట్టంలో అవకాశం : నూతన రెవెన్యూ చట్టంలో పలు అంశాలను చేర్చాలంటూ అధికార, విపక్ష ఎమ్మెల్యేలు సభల్లో చర్చలు సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అందుకు రెవెన్యూ మంత్రి అంగీకారం తెలిపారు. అలాగే ఆర్వోఆర్​-2024లో కొత్త సెక్షన్లు చేర్చేందుకు ఉన్న ఐచ్ఛికాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇందులో

  • జిల్లాల స్థాయిలోనే సమస్యల పరిష్కారం
  • రెండు దశల్లో అప్పీళ్ల వ్యవస్థ
  • ల్యాండ్​ ట్రైబ్యునళ్ల ఏర్పాటు
  • సాదాబైనామాల క్రమబద్ధీకరణ
  • వారసత్వ బదిలీ మ్యుటేషన్ల సమయంలో విచారణ ప్రక్రియ
  • ఆబాదీ భూములకు హక్కుల కల్పన

ఇలాంటి తదితర కీలక అంశాలకు కొత్త చట్టంలో స్థానం కల్పించారు. ఈ చట్టం రూపకల్పనలో కీలక భూమిక పోషించిన భూమి చట్టాల నిపుణుడు సునీల్​కుమార్​ను శనివారం పలువురు అభినందించారు. గవర్నర్​ ఆమోదం లభించగానే భూభారతి చట్టం రూపుదాల్చుకోనుంది.

భూభారతి బిల్లుకు శాసనసభ ఆమోదం - రాష్ట్రంలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందన్న సీఎం

'ధరణి పోర్టల్​లో ఆస్తుల వివరాలు తెలుసుకునే పరిస్థితి లేదు - కానీ భూ భారతిలో వివరాలు అన్నీ ఉంచుతాం'

ABOUT THE AUTHOR

...view details