Telangana Assembly Sessions 2024 Ended : కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక జరిగిన రెండో అసెంబ్లీసమావేశాలు అర్థవంతంగా సాగాయని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. రెండు కీలక తీర్మానాలతో పాటు చాలా అంశాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం విడ్డూరమన్న మంత్రి నల్గొండ సభలో రాజకీయాలు చేశారంటూ ఆక్షేపించారు. మేడిగడ్డ కుంగినందుకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.
గత ప్రభుత్వం దోపిడీ, కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం : రాజగోపాల్ రెడ్డి
Telangana Budget Sessions 2024:శాసనసభ బడ్జెట్ (Assembly Sessions 2024) సమావేశాలు 45 గంటల 32 నిమిషాల పాటు సాగాయి. 64 మంది ఎమ్మెల్యేలు శూన్య గంటలో వివిధ అంశాలపై మాట్లాడే అవకాశం దక్కింది. రెండు తీర్మానాలు, మూడు బిల్లులు, ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సమావేశాల్లో సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు, గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, కృష్ణా జలాల వాటాలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కులగణన తీర్మానం వంటి అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించారు. మండలి 11 గంటల పాటు నడిచింది.
ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది తప్ప, బాధ్యత గల విపక్షంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయలేదని శ్రీధర్‌బాబు ఆక్షేపించారు. సభను తప్పుదోవ పట్టించేలా ప్రజలను గందరగోళ పరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి చేసిన ఆయన విభజన హామీలపై కలిసి పోరాటం చేసేందుకు కలిసి రావాలని శ్రీధర్‌బాబు కోరారు.