Telangana Assembly Approved Governor Speech : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసససభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపటికి వాయిదా వేశారు. శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్(TS Budget)ను ప్రవేశపెట్టనుంది. అలాగే శనివారం ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ను మంత్రివర్గం ఆమోదించనుంది.
శాసనసభలో జరిగిన చర్చలో భాగంగా ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముందుగా ఎమ్మెల్యే వేముల వీరేశం తీర్మానాన్ని ప్రతిపాదించారు. అనంతరం ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సభలో బలపరిచారు. అనంతరం సభలో సభ్యులు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ వాడీవేడీ చర్చలు జరిగాయి. తెలుగుజాతి ముద్దు బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(Bharat Ratna PV Narasimha Rao)కు భారతరత్న రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సభలోని సభ్యులు ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను ఉద్దేశిస్తూ సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. విపక్ష నేతల ప్రశ్నలకు, రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ ప్రసంగాన్ని సాగించారు. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుని గడీల ఉండలేదు : సీఎం రేవంత్ రెడ్డి
Telangana Assembly Sessions 2024 :ముందుగా బీఆర్ఎస్ పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీకు అండగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. సీఎంను మార్చుకునే విషయం కూడా మోదీ ఇక్కడే చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ మీకు కొన్ని చెబుతారు, కొన్ని దాస్తారంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ సంబంధమన్నారు.