Team India Pacer Mohammed Siraj Reached Hyderabad :ప్రపంచ క్రికెట్ కప్ కోసం దాదాపు 11 సంవత్సరాల కల సహకారమైందని స్పీడ్ బౌలర్ సిరాజ్ మియా అన్నారు. టీ-20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం మహమ్మద్ సిరాజ్ తొలిసారిగా హైదరాబాద్ చేరుకున్నారు. సిరాజ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
హైదరాబాద్ చేరుకున్న 'మియా భాయ్' - సిరాజ్‌కు అభిమానుల ఘన స్వాగతం - Mohammed Siraj Came to Hyderabad - MOHAMMED SIRAJ CAME TO HYDERABAD
Mohammed Siraj Came to Hyderabad : టీ-20 వరల్డ్‌కప్‌లో విజయానంతరం హైదరాబాద్‌కు చేరుకున్న లోకల్ బాయ్ మహమ్మద్ సిరాజ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. సిరాజ్‌ను భారీ ర్యాలీగా ఇంటివరకు తీసుకెళ్లాలని అభిమానులు ప్రణాళిక వేశారు. ముంబైలో జరిగిన టీమిండియా విన్నింగ్ పరేడ్ తరహాలో ఈ ఊరేగింపు కూడా జరగాలని సిరాజ్ అభిమానులు భావిస్తున్నారు.
Mohammed Siraj Came to Hyderabad (ETV Bharat)
Published : Jul 5, 2024, 7:32 PM IST
|Updated : Jul 5, 2024, 7:37 PM IST
ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీ-20 ప్రపంచ కప్ గెలవడం హైదరాబాద్‌కు గర్వకారణమని సిరాజ్ అన్నారు. 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఇది మరిచిపోని రోజు అని గుర్తు చేశారు. తాను కూడా క్రికెట్ టీమ్‌కు చాలా కష్టపడుతున్నానని, ఇంకా కష్టపడి రానున్న రోజుల్లో ఇండియాకు మరిన్ని పథకాలు సాధించే విధంగా కృషి చేస్తానని అన్నారు.
Last Updated : Jul 5, 2024, 7:37 PM IST