Teachers Meet Nara Lokesh in Prajadarbar :గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి జరిగిందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని ప్రజాదర్బార్‌లో తనను కలిసిన ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీ ఉత్తర్వులు పొంది, ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని టీచర్లు లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. టీచర్ల బదిలీల్లో తాను చెడ్డ పేరు తెచ్చుకోదల్చుకోలేదని ఈ సందర్భంగా లోకేశ్ స్పష్టం చేశారు.
ఎంత ఇస్తారో చెప్పండని బొత్స, సజ్జల డబ్బులు డిమాండ్ చేశారు- లోకేశ్‌తో మొరపెట్టుకున్న పీజీటీలు - LOKESH PRAJA DARBAR
బస్సుల ఫిట్‌నెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి :నెల్లూరు జిల్లా కావలి రహదారిపై పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రమాద ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరమని అన్నారు. గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించానని అన్నారు. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండీషన్‌లో ఉంచుకోవాలని సూచించారు. బస్సుల ఫిట్‌నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచన : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా.. 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
అక్రమ బదిలీలకు ప్రభుత్వం అడ్డుకట్ట- బొత్స డబ్బు తీసుకుని మోసం చేశారని ఆందోళనలో టీచర్లు - Teachers Transfers Stop
నారా లోకేశ్ భరోసా :గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల ప్రజలు తమ పింఛన్ కోల్పోయామని లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. వారందరికీ తిరిగి పింఛన్ పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను లోకేశ్ ఆదేశించారు. ఉన్నత చదవులు చదివిన తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కొందరు, అనారోగ్యంతో తమకు వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని మరికొందరు లోకేశ్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ప్రతి ఒక్కరి వినతులను స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేశ్ వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలపై సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. దీంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలి : మంత్రి నారా లోకేశ్ - Teachers Unions Meet Lokesh