AP 10th Class Student Warning to Teacher : పదో తరగతి ఉత్తీర్ణత అనేది విద్యార్థి దశలో కీలక ఘట్టం. ఉన్నత చదువులు చదవాలన్నా, కనీసం ఇతం వరకూ చదివానని చెప్పుకోవాలన్నా పదవ తరగతి ప్రామాణికంగా చెబుతారు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్నా, కనీస విద్యార్హత పదవ తరగతిగా నిర్ణయిస్తారు. ఒకప్పుడు పదవ తరగతి ఉత్తీర్ణుడు అంటే గొప్పగా చెప్పుకునేవారు. కాలం మారుతున్న కొద్దీ విద్య అందరికీ అందుబాటులోకి రావడం, విద్యావిధానంలో పెనుమార్పుల చోటు చేసుకోవడంతో గత కొంత కాలంగా పదవ తరగతి ఉత్తీర్ణత అనేది అరటి పండు వలిచినంత తేలిక అనే అభిప్రాయం విద్యార్థుల్లో నెలకొంది.
ఒకవేళ పరీక్షలు తప్పినా, మరో రెండు నెలల్లో సప్లిమెంటరీ పరీక్షలు ఉండనే ఉన్నాయి. ఇక విద్యార్థులకు పదవ తరగతి పాస్ అవకపోతే అనే ఆలోచనే ఉండటం లేదు. కానీ ఈ పరీక్ష ఉత్తీర్ణత కోసం ఓ విద్యార్థి చేసిన పని ఇప్పుడు సంచలనం రేపుతోంది. పదవ తరగతి విద్యార్థి జవాబుపత్రంలో సమాధానం చూసి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రంలోని ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. తనకు మార్కులు వేయాలంటూ ఆ విద్యార్థి సమాధాన పత్రంలో రాసింది చదివిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కంగుతిన్న ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది.