Teacher Sleeps in Haunted Classroom : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఆనంద్‌పూర్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో బలంగా గాలి వీచినా విద్యార్థులకు భయమే. చెట్టుకొమ్మల చప్పుడు వినిపిస్తే చాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. సాయంత్రమవుతుందంటే చాలు, అయిదో తరగతి గది వైపు కన్నెత్తి చూడాలంటే విద్యార్థుల వెన్నులో వణుకు. ఎందుకంటే ఆ పాఠశాలలో దయ్యం తిరుగుతోందని విద్యార్థుల భయం. అది ఐదోతరగతిలోనే నివాసం ఉంటోదని వారి అపనమ్మకం.
విద్యార్థుల్లో భయం :రవీందర్‌రెడ్డి అనే ఉపాధ్యాయుడు జులై రెండున అక్కడికి బదిలీపై వెళ్లారు. అదేరోజు ఏడో తరగతిలో పాఠం బోధిస్తుండగా, ఓ శబ్ధం వినిపించటంతో వెనక బెంచీల్లో కూర్చున్న విద్యార్థలంతా ఒక్క పరుగున ముందుకు పరుగెత్తుకొచ్చారు. దీంతో ఉపాధ్యాయుడు ఎవమయిందని ఆరాతీస్తే, అయిదో తరగతి గదిలో దెయ్యం ఉందని విద్యార్థులు భయం భయంగా చెప్పారు. ఉపాధ్యాయుడు దయ్యాల్లేవని ఎంత చెప్పిన విద్యార్థులు నమ్మలేదు.
చిన్నారులను ఆకట్టుకొనేలా బోధన - ఈ మేడం చెప్పే పాఠాలంటే పిల్లలకు ఎంతో ఇష్టం - Special Story On Vijayawada Teacher
నిద్రపోయిన ఉపాధ్యాయుడు : మరి ఏంచేస్తే నమ్ముతారంటే, అమావాస్య రోజున ఒక్కరే నిద్రపోతే నమ్ముతామని విద్యార్థులు చెప్పారు. దీంతో జులై అయిదో తేదీన అమావాస్య రోజున రవీందర్‌రెడ్డి ఒక్కరే నిద్రపోయి విద్యార్థుల్లో ఉన్న అపనమ్మకాన్ని పటాపంచలు చేశారు. అమావాస్య రోజున రవీందర్‌రెడ్డి ఒక్కరే పాఠశాలలో నిదురపోవటం, తెల్లారాక ఆయనకు ఏమీ కాకపోవడంతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం వచ్చింది.
ఆత్మస్థైర్యంలో విద్యార్థులు :అంతుకుముందు ఉపాధ్యాయులు సైతం ఎలాంటి దెయ్యాల్లేవని చెప్పినప్పటికీ, రవీందర్‌రెడ్డి ఆచరణాత్మకంగా చూపించటం ద్వారా విద్యార్థుల్లో సంపూర్ణమైన మార్పువచ్చింది. ఇప్పుడు చిన్నారులు పాఠశాలకు ధైర్యంగా వస్తున్నారు. ఉల్లాసంగా విద్యాలయ ప్రాంగణంలో తిరుగుతున్నారు. ఆనంద్‌పూర్ పాఠశాలలో ఇప్పుడు ఎలాంటి దెయ్యం భయంలేదు. పిల్లల్లోనూ నూతన ఉత్తేజం నిండింది.
మీ జీవితానికి పూల బాటలు వేసిన ప్రియమైన గురువులకు - టీచర్స్ డే స్పెషల్ విషెస్ - ఇలా చెప్పండి! - TEACHERS DAY 2024 WISHES and Quotes
ఓ ఉపాధ్యాయుడు చేసిన గుణాత్మకమైన బోధన విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చిందని ఇతర ఉపాధ్యాయులు ప్రశంసిస్తుంటే, తనకు దెయ్యం మాస్టర్ అనే బిరుదు వచ్చిందని రవీందర్‌రెడ్డి ఆనందంగా చెబుతున్నారు. రవీందర్ రెడ్డి చేసిన ప్రయోగంతో విద్యార్థుల్లో మూఢవిశ్వాసాలపై నమ్మకం పోయింది. గ్రహణం వీడిన చంద్రుని వలె వారిలోని అపనమ్మకాలు తొలగిపోయాయి. రవీందర్‌రెడ్డి చేసిన పని రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. కానీ ఆయన ఇటీవల పదోన్నతిపై ఆనంద్‌పూర్ బడినుంచి దీపాయిగూడకు వెళ్లటమే విద్యార్థులను కొంత ఆవేదనకు గురిచేసింది.
టీచర్స్ డే స్పెషల్ : బుద్ధుడి నుంచి అబ్దుల్ కలాం దాకా - ఈ భారతీయ లెజెండరీ టీచర్స్ గురించి మీకు తెలుసా? - Teachers Day 2024 Special