Teacher Misbehaved With Girl in Krishna District :చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు, ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. గుడివాడ మండలంలో ‘సార్ నన్ను రోజూ బ్యాడ్ టచ్ చేస్తున్నారు. బడికి వెళ్లను’ అని ఓ చిన్నారి మారాం చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఉపాధ్యాయుడి వికృత చేష్టలకు ఆ చిన్నారి కొంతకాలంగా తీవ్ర వేదనకు గురయ్యింది. స్కూల్‌కు వెళ్లాలంటేనే భయంతో మొండికి వేస్తుంది. తల్లిదండ్రులు బతిమాలి, బెదిరించి ఆ చిన్నారిని స్కూల్‌కు పంపిస్తున్నారు.
టీచర్ వెకిలి చేష్టలను ఇంట్లో చెప్పలేక, ఏం చేయలేక బడికి వెళ్లేది. ఇక భరించలేక ఆ చిట్టి తల్లి ఇంట్లోనే ఓ మూల కూర్చొని రోధిస్తోంది. దిగాలుగా ఉన్న చిన్నారిని గురువారం ఉదయం (sep 26) ఎందుకు బడికి వెళ్లనంటున్నావని చిన్నారి తల్లి ప్రశ్నించింది. ఎంత అడిగినా అమ్మాయి చెప్పడం లేదు. స్కూల్‌కు వెళ్లనంటే వెళ్లను అని మారం చేసింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి, కాసేపు ఆగి పాపాయిని దగ్గరకు తీసుకుని చిన్నగా అడిగింది. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ తల్లికి అసలు విషయం చెప్పింది.
'నాకు మార్కులు వేయకపోతే - మా తాతతో చేతబడి చేయిస్తా' - టీచర్‌కు టెన్త్ విద్యార్థి వార్నింగ్ - AP 10th Class Student Warning
తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు :గుడివాడ మండలం చౌటపల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎం.చంద్రశేఖర్ (42) వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆయన కొంతకాలంగా నాలుగో తరగతి విద్యార్థినిని అసభ్యంగా తాకుతున్నాడని, దీంతో బడికి వెళ్లాలంటే భయపడుతోందని చిన్నారి తల్లి గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రూరల్ ఎస్సై ఎన్.చంటిబాబు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
Teacher Harassing on Girl Student In Khammam: విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయుడికి కుటుంబసభ్యులు, స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన ఇటీవల ఖమ్మం జిల్లా ఇల్లందులో జరిగింది. పట్టణంలోని పాఠశాలలో రాందాస్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో 9 తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని రాందాస్ కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడు రాందాస్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థినిని వేధించిన కీచక టీచర్ - దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన - దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు - Parents Attack on Teacher in AP