TDP Victory Celebrations in AP :సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించడంతో 3 పార్టీల శ్రేణులు, నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఎక్కడికక్కడ టపాసులు పేల్చి కేక్‌లు కట్ చేసి ఆనందం పంచుకున్నారు.
Krishna District :కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్ గెలుపొందడంతో కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అవనిగడ్డ ప్రధాన సెంటర్‌లో చంద్రబాబు, పవన్ కల్యాాణ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. నెల్లూరులో మాజీమంత్రి నారాయణ నివాసం జన కోలాహలంతో నిండిపోయింది. 'అభినందనలు నారాయణ మాస్టార్' అంటూ సన్మానాలతో నారాయణను ముంచెత్తారు.
కూటమి ఘన విజయం - ఊరువాడా మిన్నంటిన సంబరాలు - TDP Victory Celebrations in AP - TDP VICTORY CELEBRATIONS IN AP
TDP Victory Celebrations in AP : ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అఖండ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన నేతలు గెలవడంతో ఆయా నియోజకవర్గ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి మిఠాయిలు ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 6, 2024, 9:23 AM IST
TDP Victory Celebrations in Foreign Countries : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై దేశ విదేశాల్లోని తెలుగుదేశం అభిమానులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. లండన్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యురాలు ఉప్పాల రత్నశ్రీ ఆధ్వర్యంలో పలువురు ప్రవాసాంధ్రులు కుటుంబ సభ్యులతో కలిసి కూటమి సంబరాలు చేసుకున్నారు
Unemployed Celebrations TDP Victory in Anantapur : తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడంతో అనంతపురంలో నిరుద్యోగ యువత సందడి చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆనందం వ్యక్తం చేశారు. అఖండ మెజారిటీతో గెలుపొందిన అమిలినేని సురేంద్ర బాబుకు కళ్యాణదుర్గం ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఓట్ల లెక్కింపు ఫలితాలు అనంతరం అక్కమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల తెలుగుదేశం కార్యాలయం వద్ద కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎన్ఎండీ ఫరూక్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
బాస్ ఈజ్ బ్యాక్ - ఆనందంలో ఎన్ఆర్ఐలు సంబరాలు - NRI Celebrations In Vijayawada
Guntur :సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో గుంటూరు జనసేన కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన నారా చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలకు ఆ పార్టీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. ప్రజలకు మిఠాయిలు పంచి పెట్టారు. వైఎస్సార్సీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అమలాపురం పార్లమెంటు సభ్యుడు గంటి హరీష్ మాధుర్ అన్నారు.
కూటమి విజయంతో - రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు - TDP Workers Celebrations