ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా సంతాప సభలతో నివాళులు అర్పించిన టీడీపీ శ్రేణులు - TDP Leaders Pays Tribute To Ramoji Rao - TDP LEADERS PAYS TRIBUTE TO RAMOJI RAO

TDP Leaders Pays Tribute To Ramoji Rao : ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులతో పాటు వివిధ రాజకీయపార్టీలు, జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, ప్రజలు నివాళులర్పించారు. రామోజీరావు మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటంటూ అంజలి ఘటించారు. జోహార్‌ రామోజీరావు అంటూ నినాదాలు చేశారు. పత్రికా రంగంలో రామోజీరావు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.

TDP Leaders Pays Tribute To Ramoji Rao
TDP Leaders Pays Tribute To Ramoji Rao (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 6:34 PM IST

TDP Leaders Pays Tribute To Ramoji Rao :రామోజీరావు మరణంతో రాష్ట్రంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయనకు రాజకీయపార్టీలు, జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, ప్రజలు నివాళులర్పించారు. జోహార్‌ రామోజీరావు అంటూ నినాదాలు చేశారు. పత్రికా రంగంలో రామోజీరావు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. రామోజీరావు మృతి పట్ల పశ్చిమగోదావరి జిల్లా ఉండి, భీమవరం ఎమ్మెల్యేలు మంతెన రామరాజు(RRR), పులపర్తి రామాంజనేయులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల ఆధ్వర్యంలో సంతాపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

రైతుబిడ్డగా మొదలై మీడియా మహాసామ్రాజాన్ని నిర్మించిన యోధుడు రామోజీ రావు - Ramoji Rao Biography

నిరంతర అక్షర యోధుడు, నవ సమాజ స్థాపనకు నిత్యం పోరాడే మహనీయుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. విజయవాడలో ఉన్న ఆయన రామోజీరావు గారి మరణ వార్త విని హుటాహుటిన హైదరాబాద్​కు బయలుదేరి వెళ్లారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సంధ్యారాణి నివాళులు అర్పించారు. రామోజీ సంస్థల ఛైర్మన్, ఈనాడు అధినేత అకస్మిక మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సంధ్యారాణి మాట్లాడుతూ, రామోజీరావు జీవించినంత కాలం సమాజ సేవ కోసమే పని చేశారని వెల్లడించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి రామోజీ ఫిలిం సీటీని చూడటం కోసం వస్తారని గుర్తుచేశారు.

ఆతిథ్యరంగ సంస్థల్లో ప్రముఖ స్థాయిలో డాల్ఫిన్ హోటళ్లు - Ramoji Dolphin Hotels

నిజాలను ప్రజలకు చేరవేయాలి, ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేసేలా ఉండాలని తపించే ఏకైక వ్యక్తి చెరుకూరి రామోజీరావని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. అలాంటి వ్యక్తి మరణం అత్యంత బాధాకరమని తెలిపారు. ఎక్కడో చిన్న రైతు కుటుంబంలో పుట్టి అచంచలమైన కష్టంతో ప్రపంచం మెచ్చే వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన తీరు అనితర సాధ్యమని కొనియాడారు. ఎన్నో ఆటుపోట్లు మరెన్నో అవమానాలు అన్నింటినీ ఎదురొడ్డి, రామోజీరావు ఈ స్థాయికి చేరారని గుర్తు చేసారు. వాస్తవాలు మాత్రమే ప్రజలకు తెలియాలని ఈనాడు అనే మీడియా వ్యవస్థను స్థాపించి ప్రజలకు తోడుగా నిలిచారని కొనియాడారు.

మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి లాంటి ఎన్నో వ్యాపార సంస్థల్ని స్థాపించారని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేశారని వెల్లడించారు. అతి తక్కువ సమయంలోనే జాతీయస్థాయి నెట్ వర్క్​గా ఈటీవీని విస్తరించారు. తెలుగు నాట ఎన్ని వార్తా పత్రికలొచ్చినా, ఎన్ని టీవీ ఛానళ్లు వచ్చినా నిజ నిర్ధారణ కోసం చూసే ఏకైక న్యూస్ నెట్‌వర్క్‌గా ఈనాడు, ఈటీవీని రూపుదిద్దారుని తెలిపారు. రామోజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగుజాతికి తీరని లోటని యనమాల రామకృష్ణుడు అన్నారు.

రామోజీరావు మృతి పట్ల పలువురు ప్రభుత్వ అధికారులు సంతాపం! - Officials Tribute to Ramoji Rao

రాష్ట్రవ్యాప్తంగా రామోజీరావుకు నివాళులర్పించిన టీడీపీ నేతలు - జోహార్‌ రామోజీరావు అంటూ నినాదాలు (ETV Bharat)

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details