TDP Leaders Celebrate Minister Nara Lokesh Birthday:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ 42వ జన్మదిన వేడుకలను తెలుగు తమ్ముళ్లు పండుగలా చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవి కేక్ కట్ చేశారు.
గుంటూరులో టీఎన్ఎస్ఎఫ్(TNSF) ఆధ్వర్యంలో లోకేశ్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు చేయించారు. చిలకలూరిపేటలో కార్యకర్తలు లోకేశ్ మాస్కులు ధరించి బైకు ర్యాలీ చేశారు. చీరాల ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంచారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో పేదలకు బిర్యానీ పంపిణీ చేయగా, టీడీపీ నేత మహంతి వాసుదేవరావు రెండు నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇటీవల వరదలకు నష్టపోయిన దుకాణదారులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పరిహారం అందించారు. కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లోకేశ్పేరుతో కొబ్బరికాయలు కొట్టారు.
డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ఎఫెక్ట్- గిరిజన ప్రాంతాల్లో రోడ్ల కోసం నిధుల విడుదల
1000 మందికి పైగా కార్యకర్తలు రక్తదానం:పశ్చిమ గోదావరి జిల్లా మంచిలిలో టీడీపీ నేతలు ఆలయాలు, స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు, పేదల కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. భీమవరంలో అన్నదానం, వస్త్రదానం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ పాఠశాల విద్యార్థులు హ్యాపీ బర్త్ డే లోకేశ్ సర్ అనే ఆకారంలోకి కూర్చుని శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరంలో 1000 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. విజయనగరంలో ఎమ్మెల్యే అదితి, ఆమె సోదరి విద్యావతి రక్తదానం చేశారు.