TDP leader Nimmala Ramanaidu:ప్రజలు తనని మోసం చేశారంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు స్పందించారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తికి అదే ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారని తెలిపారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన తనకు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.
జగన్ వ్యాఖ్యలకు రామానాయుడు కౌంటర్:ప్రజలు తనని మోసం చేశారన్నట్లుగా జగన్ మాట్లాడటం అతని ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమని నిమ్మల రామానాయుడు విమర్శించారు. తన చేతకానితనాన్ని ప్రజలమీదికి నెట్టేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనేనేమోనని ఆయన మండిపడ్డారు. అమలు చేయని మేనిఫెస్టోని 99శాతం అమలు చేసినట్లు పదే పదే అబద్ధాలు చెప్తే నిజం తెలుసుకోని అవివేకులు ప్రజలు కాదని అన్నారు. కనీస పరిపాలన చేతకాక ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిచినందుకు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలుసుకోవాలని హితవుపలికారు. మోసం, విధ్వంసం, దాడులు, పన్నుల భారం వంటి వాటితో విసిగిపోయిన ప్రజలు కసిగా ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు. తన పాలనా వైఫల్యాలు ఇప్పటికీ గుర్తించకుండా ప్రజలమీదే నిందలు మోపితే ఇక జీవితంలో జగన్ బాగుపడడని రామానాయుడు ధ్వజమెత్తారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన జగన్ కు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని తెలుసుకోవాలని హితవు పలికారు. నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అవ్వాతాతలు, అక్కా చెల్లెళ్లు జగన్ ను మోసం చేసినట్లు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందన్నారు.
ప్రజల నుంచి వెల్లువెత్తిన విమర్శలు - సీఐడీ ఏడీజీ సంజయ్ సెలవు రద్దు - Government Cancelled CID Chief Sanjay Leave