TDP Leader Kanakamedala Ravindra Kumar :రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగాలంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy), సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy)ను వెంటనే బదిలీ చేయాలని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలపై దాడుల విషయంలో ఈసీ అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఏది చెబితే అదే శాసనమంటూ కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ, సీఎస్‌ను బదిలీ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని సీఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు జరిగిన నేరాలపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన నేరాలపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.
వైఎస్సార్సీపీ నేతలు గొడవలు సృష్టించే అవకాశం :రాష్ట్రంలో కేవలం 14 నియోజకవర్గాలనే సమస్యాత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించిందని, అందులో పులివెందుల, కుప్పం లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కుప్పంలో హింసాత్మక ఘటనలు చేస్తూ వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నామని తెలిపారు. కుప్పంలో వైఎస్సార్సీపీ నేతలు గొడవలు సృష్టించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కావున కుప్పంలో కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.