TDP leader Ayyanna Patrudu Allegations:ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్స్ షర్మిలకు భద్రత పెంచాలని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ఆస్తుల విషయంలో జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఆమెను అంతమెందించినా ఆశ్చర్య పడక్కర్లేదని అందోళన వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఆస్తులు చేజారిపోతే ఎలా: వైఎస్ రాజశేఖరెడ్డికి అత్యంత ప్రియమైనదిగా కూతురు షర్మిల అన్నది సన్నిహితులందరికి తెలుసనీ, అందుకే అమెకు ప్రత్యేకంగా ఆస్తిలో వాటా రాశారని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆ ఆస్తిని ఇవ్వకుండా జగన్ అడ్డుకుంటున్నారని అయ్యన్న ఆరోపించారు. ఈడీ అటాచ్ మెంట్ లో వున్న ఆస్తులు చేజారిపోతాయనే భయం జగన్ కి వుందని విమర్శించారు. ఆ ఆస్తులు చేజారిపోతే ఎలా అని, అందుకే షర్మిల కు వైయస్సార్ ఇచ్చిన వాటాను పంచకుండా ఆపుతున్నాడని అయ్యన్న తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే అంశంపై నోరు జారిన విషయాన్ని గమనించారా అంటూ కొత్త అంశాన్ని అయ్యన్న తెరపైకి తెచ్చారు. బాబాయ్ లాంటి ఘటనలు జరుగుతాయంటూ సజ్జల అన్నవిషయాన్ని గుర్తు చేశారు. తనకు ప్రాణహాని వుందని రివాల్వర్ లైసెన్స్ కు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నానని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఎస్పీ గన్‌మెన్‌ను ఇస్తామన్నారని, కానీ, తానే వద్దని చెప్పానన్నారు. ఎందుకంటే తాను ఎక్కడ వున్నానో వారే ఉప్పందిస్తారనే భయం తనకు ఉందన్నారు.
వైఎస్సార్ పాలనతో జగన్‌కు పోలికే లేదు- బీజేపీకి బానిసలా మారిన వైసీపీ : షర్మిల