సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్న కూటని నేతలు - ఎన్నికల్లో వైసీపీకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు TDP Janasena BJP Leaders Election Campaigning : ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అభ్యర్థులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థించారు. గెలిస్తే ఏం చేస్తారో అన్న విషయాన్ని ప్రజలకు వివరించారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని కూటమి అభ్యర్థులు హామీ ఇచ్చారు. మరోవైపు తెలుగుదేశంలోకి చేరికలు భారీగా పెరిగాయి.
జోరు పెంచిన కూటమి అభ్యర్థులు - వైసీపీ అరాచకాలు ఎండగడుతూ ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూటమి అభ్యర్థులు కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. బందరు మండలం పెదపట్నంలో తెలుగుదేశం అభ్యర్థి కొల్లురవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో ప్రచారం చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. జగన్ దళితులకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల స్వేచ్ఛను హరించిన వైసీపీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని నేతలు పిలుపునిచ్చారు.
Election Campaign in AP :ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదూరు, వెల్దుర్తిపాడులో తెలుగుదేశం అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. కూటమిని గెలిపించాలని కోరారు.
జగన్ అధికారంలోకి రావడం కలేనని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డి అన్నారు. పొరపొటునో, చేయిజారో జగన్‌కు ఓటేస్తే ఇక ప్రజల సంగతి అంతేనని వ్యాఖ్యానించారు. వ్యవస్థలను నాశనం చేసిన జగన్‌ను ఇంటింకి పంపాలని పిలుపునిచ్చారు. ఖాజీపేటలోని రవీంద్రారెడ్డిని ఆయన స్వగృహంలో మైదుకూరు కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Election Campaign of all Parties : వైఎస్సార్ జిల్లా మైదుకూరు కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణంలోని ఇందిరాకాలనీలో తిరుగుతూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించారు. కాలనీల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరించారు. రాయచోటి కూటమి అభ్యర్థి రామ్‌ప్రసాద్‌రెడ్డి లక్కిరెడ్డి మండలంలో పర్యటించారు. రామ్‌ప్రసాద్‌రెడ్డికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ఇంటింటికి ప్రచారానికి వెళ్లిన ఆయనకు మహిళలు హారతులు ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో రాయచోటి తెలుగుదేశం అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. మహిళలు ఘన స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. ప్రచారంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అరాచక పాలనను తరిమికొట్టి ప్రజాప్రభుత్వానికి ఓట్లేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు వ్యతిరేకంగా ఆమె అల్లుడు, తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మాచాని సోమనాథ్ ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. అలాగే కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరఫున సోమనాథ్ ప్రచారం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కూటమిని గెలిపించాలని కోరారు.
ఫ్యాన్ వేడిగాలి తట్టుకోలేక- దూసుకుపోతున్న సైకిల్ ఎక్కి సేదతీరుతోన్న వైసీపీ నేతలు
మరింత జోరుగా ఎన్నికల ప్రచారాలు - కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష స్పందన